Thiruparankundram Deepam Row: తిరుప్పరంకుండ్రం కొండపై ఇవాళ వెలుగనున్న దీపం.. పర్యవేక్షించనున్న హైకోర్టు జడ్జిలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు!
తిరుప్పరంకుండ్రం(Thiruparankundram Deepam Row) రాతిస్తంభంపై ఇవాళ దీపం వెలిగించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించడంతో కొండ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.
Thiruparankundram karthigai deepam dispute supreme court order crpf security contempt notice
సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు.. ఇద్దరు హైకోర్టు జడ్జిల పర్యవేక్షణ:
కోర్టు ఆదేశాల అమలులో తమిళనాడు పోలీసులు విఫలమయ్యారని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొండ భద్రతా బాధ్యతలను కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్కు అప్పగించింది. దీంతో శనివారం ఉదయం నుంచే అక్కడ ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ మండపంపై వెలిగే దీపం నుంచి జ్వాలను తీసుకెళ్లి రాతిస్తంభం వద్ద దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు సూచించగా, ఈ జ్వాల కార్యక్రమాన్ని ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు స్వయంగా పర్యవేక్షించనున్నారు.
దర్గా వద్ద కట్టుదిట్టమైన భద్రత.. తదుపరి పరిణామాలపై ఉత్కంఠ:
కొండపై దీపం వెలిగించే క్రమంలో సికందర్ దర్గాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పోలీసులు దర్గా పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలను తనిఖీ చేసిన తర్వాతే సందర్శకులను అనుమతిస్తున్నారు. మరోవైపు మధ్యంతర ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ధిక్కరణ నోటీసులపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
