Vrushakarma : వామ్మో.. వృషకర్మ కోసం 4 ఎకరాల్లో భారీగా.. చైతూ కామెంట్స్.. సినిమాపై మరిన్ని అంచనాలు..
నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. (Vrushakarma)
Vrushakarma
Vrushakarma : నాగచైతన్య హీరోగా వస్తున్న వృషకర్మ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ కానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
నాగచైతన్య మాట్లాడుతూ.. ఇందులో ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ కూడా ఉంది. చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా మొదటి 20 నిముషాలు ఒక గుహలోనే ఉంటుంది. రియల్ గుహలో సేఫ్టీ లేకండా అంత షూటింగ్ చేయలేము. అందుకే మేము ఒక గుహని సెట్ వేసి నిర్మించాం. దాదాపు 4 ఎకరాల్లో 40 అడుగులు ఎత్తు గుహ లోపల ఉండేలాగా నిర్మించాము. ఆ గుహలో చాలానే యాక్షన్ సీక్వెన్ లు ఉన్నాయి అని తెలిపారు.
Also Read : Nani – Sharwanand : ఈ యాక్షన్ బ్లడ్ బాత్ లు అవసరమా..? బ్లడ్ బాత్ తో భయం పుట్టిస్తున్న క్లాస్ హీరోలు..
ఈ సినిమాలో బోలెడన్ని యాక్షన్ సీన్స్, రిస్కీ షాట్స్ ఉన్నాయని, సినిమా కోసం పలు సెట్స్ వేసి భారీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ వృషకర్మ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
