Sudigali Sudheer : సుధీర్‌కి బాధ్యత లేదు.. రెమ్యునరేషన్ తీసుకొని షూటింగ్ కి రాలేదు.. నిర్మాత సంచలన కామెంట్స్..
నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో సుధీర్ పై, దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసారు. (Sudigali Sudheer)
Sudigali Sudheer
Sudigali Sudheer : బుల్లితెరపై స్టార్ డమ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే సుధీర్ గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా దాదాపు రెండేళ్లు వాయిదా పడి అనేక గొడవలు అయి రిలీజ్ అయింది. డైరెక్టర్ సినిమాని నాశనం చేసి, డైరెక్టర్ హీరోయిన్ తో గొడవ పెట్టుకొని, అది మహిళా కమిషన్ వరకు వెళ్లి, డైరెక్టర్ ని సినిమా నుంచి తీసేయడం, సినిమా సీన్స్ లీక్ చేయడం, సుధీర్ ప్రమోషన్స్ కి రాకపోవడం, సుధీర్ సినిమా నుంచి మధ్యలో తప్పుకోవడం, సుధీర్ ట్రైలర్ కి డబ్బింగ్ చెప్పకపోవడం.. ఇలా అనేక వివాదాల మధ్య గోట్ సినిమా రిలీజయింది.
ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడిపై, సుధీర్ పై తీవ్ర విమర్శలు చేసారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ గానే మిగిలింది. సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో సుధీర్ డూప్, గ్రాఫిక్స్ పెట్టి చేసారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో సుధీర్ పై, దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసారు.
Also See : Sowmya Rao : అండమాన్ బీచ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మాజీ జబర్దస్త్ యాంకర్.. సౌమ్య రావు ఫొటోలు..
నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుధీర్ షూటింగ్స్ కి రానన్నడు. క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ CG, డూప్స్ తో చేసాము. రెమ్యునరేషన్ మొత్తం తీసేసుకున్నాడు. అయినా షూటింగ్ కి రానన్నడు. సినిమా సరిగ్గా చేయలేదు. ప్రొఫెషనలిజం లేకుండా చేసారు. ఏమైనా ప్రశ్నిస్తే స్పందించరు. బడ్జెట్ పెరిగినా సుధీర్ తో మాట్లాడితే ఆయన కూడా పట్టించుకోలేదు. డైరెక్టర్ వైపే ఉన్నాడు. అప్పటికి సుధీర్ అడిగాడనే రెండు కోట్లు పెంచాను బడ్జెట్. అయినా మారలేదు. ఆర్టిస్టులు చేసేది నటన. స్క్రీన్ మీద కనపడినట్టు బయట ఉండరు. సుధీర్ కష్టపడ్డాడు, తిండి లేకుండా పైకి వచ్చాడు అంటారు. దాంతో సినిమా మీద బాధ్యతగా ఉంటాడేమో అనుకున్నా. కానీ ఆ బాధ్యత అతనికి లేదు.
రష్మీ ని సెకండ్ హీరోయిన్ తెస్తా అన్నారు, సుధీర్ మాట్లాడతా అన్నారు. ఆమె చేయను అంటే కనీసం ఐటెం సాంగ్ కి అయినా తెద్దాం అన్నారు. సుధీర్ – డైరెక్టర్ ఫ్రెండ్స్. మొదట వాళ్ళు చెప్పింది నమ్ముకుంటూ వెళ్ళా. కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. మొదట్లోనే సుధీర్ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేసింది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా సినిమాలో సరిగ్గా రాయలేదు. డైరెక్టర్ ని అడిగితే సుధీర్ నాకు బాగానే ఉంది, ప్రాబ్లమ్ లేదు అన్నాడు. షూటింగ్ కి రాకపోతే సుధీర్ ని షూటింగ్ కి రమ్మని రిక్వెస్ట్ చేసాము. వేరే వాళ్ళ ముందు మాట్లాడించినా, ఫిలిం ఛాంబర్ తో మాట్లాడించినా రాలేదు. లాస్ట్ 30 శాతం షూటింగ్ కి ఆయన రాలేదు. నా నెంబర్ కూడా బ్లాక్ చేసారు. మేనేజర్ తో ఫోన్ చేసి షూటింగ్ కి రాను అని చెప్పించాడు. మూడున్నర కోట్లతో సినిమా అనుకున్నాం. తర్వాత 5 కోట్లు అయింది. కానీ 30 శాతం షూటింగ్ అయ్యేసరికి 9 కోట్లు దాటేసింది. తర్వాత వేరే డైరెక్టర్ ని పెట్టుకొని చేశాను. 14 కోట్లు అయింది మొత్తం సినిమాకు అని బాధపడ్డారు. మరి దీనిపై సుధీర్ ఏమైనా స్పందిస్తాడా చూడాలి.
