BSNL Recharge Plan : BSNL బంపర్ ఆఫర్.. రూ.2,449కే 380 రోజుల వ్యాలిడిటీ, 760GB డేటా, రూ. లక్ష ఇన్సూరెన్స్..!
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ రూ.2,449 రీఛార్జ్ ప్లాన్‌తో 380 రోజుల వ్యాలిడిటీ, 760GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSతో పాటు రూ.1 లక్ష ప్రమాద బీమా, రూ.10 వేల సైబర్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.
BSNL Offers Rs 1 Lakh Insurance
- ఏడాది దాటినా రీఛార్జ్ టెన్షన్ లేదు..
- BSNL ప్లాన్‌లో రూ.లక్ష బీమా కూడా
- రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్
- 380 రోజులు ఫ్రీ కాల్స్, డేటా, సైబర్ బీమా
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ రీఛార్జ్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న ఈ రోజుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు ప్లాన్ రావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.అలాంటి కస్టమర్ల కోసం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది.
కేవలం రూ.2,449తో ఏకంగా 380 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు.. అంతేకాదు.. డేటా, కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు ఇన్సూరెన్స్ కవరేజీని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మరిన్ని ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
బీఎస్ఎన్ఎల్ రూ.2,449 ప్లాన్ ఏంటి? :
ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 380 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదికి పైగా మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. గతంలో ఈ ప్లాన్‌కు 365 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. తాజాగా 380 రోజులకు పెంచింది.
డేటా విషయానికి వస్తే.. రోజుకు 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. మొత్తం వ్యాలిడిటీని లెక్కలోకి తీసుకుంటే 760GB డేటా వస్తుంది. అదనంగా రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా ఫోన్ మాట్లాడేవారికి, రోజూ ఇంటర్నెట్ వాడేవారికి ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.
రూ.లక్ష ప్రమాద బీమా.. రూ.10 వేల సైబర్ కవరేజ్ :
ఈ ప్లాన్‌లో ఇన్సూరెన్స్ అనేది అందరిని ఆకట్టుకుంటోంది. అర్హతలు, నిబంధనలకు లోబడి రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా కవరేజీ అందిస్తుంది. రోడ్డు ప్రమాదాలు, కాలిన గాయాలు, పాము కాటు, పిడుగుపాటు, విద్యుదాఘాతం వంటి ప్రమాదాలకు ఈ కవరేజ్ వర్తిస్తుంది. అంతేకాదు.. సైబర్ మోసాల నుంచి ప్రొటెక్షన్ కల్పించేందుకు రూ.10వేల వరకు సైబర్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తుంది.
Why settle for just connectivity when you can get extra protection too?
👉 For more information:
1800 11 8485Recharge smart via #BReX
https://t.co/Kn6UZ2nVeK#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #BSNLinsurance #oicl #benefits
@oiclinsurance @CMDBSNL @robertravi21
— BSNL India (@BSNLCorporate) November 19, 2026
రీఛార్జ్ చేసే ముందు ఇవి తెలుసుకోండి :
ధర తక్కువగా ఉండటంతో పాటు ఎక్కువ వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, ఇన్సూరెన్స్‌కు సంబంధించిన అర్హతలు, క్లెయిమ్ విధానం, కవరేజ్ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
అలాగే ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్ బెనిఫిట్స్, షరతులను కూడా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా చెక్ చేసుకోండి. మొత్తానికి ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి బీఎస్ఎన్ఎల్ రూ.2,449 ప్లాన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు..
