Anushka Shetty : టాలీవుడ్‌కు అనుష్క గుడ్‌బై చెప్పేసిందా?
Anushka Shetty : హీరోయిన్గా అనుష్క మంచి పేరు తెచ్చుకుంది. అరుంధతి
Is Anushka Shetty good bye to tollywood
Anushka Shetty : హీరోయిన్గా అనుష్క మంచి పేరు తెచ్చుకుంది. అరుంధతి, బాహుబలి సినిమాలతో సక్సెస్ కొట్టి లక్షలామంది హాట్ ఫేవరేట్‌గా ఉండిపోయారామె. ఘాటి మూవీ తర్వాత టాలీవుడ్లో మరే సినిమాలో కనిపించని అనుష్క టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత ఆమె నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు.
అయితే స్వీటీ మళ్లీ టాలీవుడ్లో బిజీ అవుతుందని, హైదరాబాద్‌లోనే ఉంటూ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అభిమానులు ఆశించారు. తాజాగా వినిపిస్తున్న ఓ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో తనకు ఉన్న ప్రాపర్టీని అనుష్క అమ్మేసినట్లు ప్రచారం జరుగుతోంది.
MEGA VS BALAIAH TALK SHOW : ఓటీటీలో రచ్చరచ్చే ఇక.. మెగా వర్స్ vs అన్ స్టాపబుల్
హైదరాబాద్‌లో ఉన్న ఫ్లాట్‌ను అనుష్క అమ్మేసిందన్న వార్తతో అనుష్క అభిమానుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి. నిజంగానే ఆమె హైదరాబాద్‌కు దూరం కానున్నారా.? టాలీవుడ్ సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారా.? లేక వ్యక్తిగత కారణాలతోనే ప్రాపర్టీని విక్రయించారా.? అనే చర్చ సాగుతోంది.
అయితే ప్రాపర్టీ అమ్మినట్లు వస్తున్న వార్తలపై ఆమె నుంచి ఎలాంటి అఫిషీయల్ ప్రకటన రాలేదు. కానీ ఇకపై సినిమాలు మానేస్తున్నందుకే, హైదరాబాద్ వచ్చే పని లేనందుకే అనుష్క ఆ ఇంటిని అమ్మేసిందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అనుష్క మళ్లీ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్లో సందడి చేయాలని కోరుకుంటున్న అభిమానులకు మాత్రం ఈ ప్రచారం చిన్నపాటి షాక్ అనే చెప్పాలి.
