New Coronavirus Variant PJ.2.1 : మళ్లీ కరోనా కలకలం.. 18 దేశాలకు కొత్త వేరియంట్.. భారత్‌కు ముప్పు ఉందా? WHO ఏం చెప్పిందంటే?
New Coronavirus Variant 2026 : కరోనా కొత్త వేరియంట్ పీజే.2.1 కలకలం రేపుతోంది. 18 దేశాల్లో వైరస్ ఆనవాళ్లు, 24 మ్యుటేషన్లు, వ్యాక్సిన్ల ప్రభావం, లక్షణాలు, ప్రమాదంపై డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందో తెలుసా?
New Coronavirus Variant 2026
- కరోనా మళ్లీ విజృంభిస్తుందా?
- కరోనా కొత్త వేరియంట్ PJ.2.1 ఎంట్రీ
- 18 దేశాల్లో కరోనా కొత్త వైరస్ జాడలు..
- కొత్త వేరియంట్‌పై WHO కీలక ప్రకటన
New Coronavirus Variant 2026 : కరోనా మహమ్మారి రోజులు ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. ఇంతలోనే మరో కొత్త వేరియంట్ తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. JN.1 కుటుంబానికి చెందిన PJ.2.1 అనే కొత్త కరోనా వేరియంట్ ప్రస్తుతం పలు దేశాల్లో గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 8 నాటికి 18 దేశాల్లో ఈ వేరియంట్ ఆనవాళ్లు కనిపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా, కెనడాలో దీని వ్యాప్తి పెరుగుతున్నట్లు గుర్తించింది..
అసలేంటి ఈ PJ.2.1 వేరియంట్? :
ఒమిక్రాన్‌కు చెందిన జేఎన్.1 కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్. దీని స్పైక్ ప్రోటీన్‌లో ఏకంగా 24 జన్యు మార్పులు ఉన్నాయి. సాధారణంగా వైరస్‌లో మార్పులు క్రమంగా జరుగుతుంటాయి. కానీ, ఈ వేరియంట్లో ఒకేసారి భారీ మార్పులు చోటుచేసుకోవడంతో శాస్త్రవేత్తలు దీనిని సాల్టేషన్ వేరియంట్‌గా పిలుస్తున్నారు..
Read Also : Adinarayana Reddy : చంద్రబాబు, లోకేశ్‌తో భేటీ తరువాత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
వ్యాక్సిన్లు పనిచేస్తాయా? :
ఈ కొత్త వేరియంట్‌పై ఇప్పటికే పలు ప్రయోగశాల స్థాయి అధ్యయనాలు జరిగాయి. ఎల్పీ.8.1, ఎక్స్ఎఫ్జీ వేరియంట్లకు అనుగుణంగా రూపొందించిన వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు పీజే.2.1ను కూడా ఎదుర్కోగలిగినట్లు ప్రాథమిక ఫలితాలు సూచిస్తున్నాయి. ఎక్స్ఎఫ్జీ-అడాప్టెడ్ వ్యాక్సిన్ తీసుకున్న 22 మందిపై చేసిన అధ్యయనంలో 14 రోజుల తర్వాత యాంటీబాడీ స్థాయిలు 2.8 రెట్లు పెరిగాయి.
భయపడాల్సిన అవసరం ఉందా? :
ప్రస్తుతానికి ఈ వేరియంట్ వల్ల తీవ్రమైన అనారోగ్యం పెరుగుతుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. WHO అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దీని అదనపు ప్రజారోగ్య ముప్పు తక్కువగానే ఉంది. అయితే, వ్యాధి తీవ్రతపై మరింత పరిశోధన అవసరం..
జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. కొత్త వేరియంట్‌పై ఆందోళన కన్నా అప్రమత్తతే చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
