IND vs NZ 1st Test : అయ్యో గిల్.. ఇలా చేశావేంటి? మూడోరోజు ముగిసిన ఆట.. పట్టు బిగిస్తున్న టీమిండియా..
IND vs NZ 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది.
KL Rahul Shubman Gill
IND vs NZ 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ లో కివీస్ పై 118 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ఓవర్‌నైట్ స్కోర్ 159/1తో మూడోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా బ్యాటర్లు కివీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ (290 బంతుల్లో 136 పరుగులు, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సులు) సెంచరీ చేయగా.. దేవ్‌దత్ పడిక్కల్ 80 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ (98) రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మూడోరోజు ఆట ముగిసేందుకు మరో రెండు బంతులే ఉండగా.. డఫీ బౌలింగ్ లో గిల్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సెంచరీ చేయకుండా అభిమానులను గిల్ నిరాశపర్చాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో రిషబ్ పంత్ (55 నాటౌట్), అన్షుల్ కాంబోజ్ ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 368 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా 118 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాల్గోరోజు తొలి సెషన్లోనే టీమిండియా 500 పరుగులు దాటిన తరువాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో త్వరగా వికెట్లు కోల్పోయి తక్కువ పరుగులకే ఔట్ అయితే.. టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే.. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో రెండు రోజుల ఆటలో ఏం జరుగుతుందోనని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Stumps on Day 3!
Glorious performances through the batting order take #TeamIndia to a commanding lead 👏
Scorecard ▶️ https://t.co/AfKNPUCjYW
#NZvIND https://t.co/RT39L2r300
— BCCI (@BCCI) November 21, 2026
