Aamir Khan : వామ్మో.. అమీర్ ఖాన్‌కి ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయా.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు.. జస్ట్ అద్దెలతోనే నెలకు..
తాజాగా ఓ బాలీవుడ్ నివేదిక వివరాల ప్రకారం అమీర్ ఖాన్ కి కేవలం అద్దెల ద్వారానే నెలకు కోటి రోపాయల వరకు వస్తాయంట. (Aamir Khan)
Aamir Khan
Aamir Khan : సినిమా సెలబ్రిటీలు సినిమాల్లో సంపాదించిన డబ్బులను బిజినెస్ లలో పెట్టుబడులు పెడతారు. కొంతమంది మాత్రం ఇల్లు, అపార్ట్మెంట్స్, కమర్షియల్ బిల్డింగ్స్.. ఇలా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఇలాగే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారంట.
తాజాగా ఓ బాలీవుడ్ నివేదిక వివరాల ప్రకారం అమీర్ ఖాన్ కి కేవలం అద్దెల ద్వారానే నెలకు కోటి రోపాయల వరకు వస్తాయంట. అమీర్ ఖాన్ కి ముంబైలోని శాంతక్రూజ్ సబర్బన్ ఏరియాలో 3 విలాసవంతమైన ప్రాపర్టీలున్నాయి వీటి ద్వారా నెలకు దాదాపు 40 లక్షలు అద్దె వస్తుంది. ఏడాదికి 5 శాతం అద్దె పెంచే రూల్ కూడా అగ్రిమెంట్ లో ఉందట. అలాగే ముంబైలోని పాలీ హిల్ ప్రాంతంలో 4 అపార్ట్మెంట్ లు ఉన్నాయట. వీటికి నెలకు దాదాపు 30 లక్షల వరకు రెంట్ వస్తుందట. ఈ రెంటల్స్ డిపాజిట్ కింద ఆల్రెడీ ఒక కోటీ 46 లక్షల రూపాయలు తీసుకున్నాడట అమీర్ ఖాన్.
ఇవే కాకుండా ముంబైలోని విర్గో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, విల్నో మోనా అపార్ట్మెంట్స్, హిల్ వ్యూ, మెరీనా అపార్ట్ మెంట్లలో కూడా అమీర్ ఖాన్ కి ఫ్లాట్స్ ఉండగా వాటిని కూడా అద్దెకిచ్చాడు. ఇలా కేవలం అద్దెలతోనే అమీర్ ఖాన్ దాదాపు నెలకు కోటి రోపాయలపైగా సంపాదిస్తున్నాడు. ఇవన్నీ అతని ఆస్తులే. ఇవే కాకుండా తాను ఉండే సొంత ఇల్లు, తన ప్రొడక్షన్ ఆఫీస్ తో పాటు మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్ పంచగనిలో ఓ 2 ఎకరాల పెద్ద ఫామ్ హౌస్ ఉందట. దాని ఖరీదు కూడా దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇలా అమీర్ ఖాన్ తన ఆస్తిని ఇల్లు, ఫ్లాట్స్ రూపంలో పెట్టుబడులు పెట్టి వాటిపై సంపాదిస్తున్నాడు.
