Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. నూతన వధూవరులకు గాయాలు..
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాలోని పెళ్లూరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Road Accident
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాలోని పెళ్లూరు సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. నూతన వధూవరులకు గాయాలయ్యాయి.
పెండ్లి బృందం కారులో తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం బాపట్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన నవ వధూవరులు శ్రీతేజ, కౌశల్యను ఒంగోలులో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా బాపట్లకు చెందిన వారిగా తెలుస్తుంది.
మృతులు డ్రైవర్ ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మీలుగా పోలీసులు గుర్తించి.. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుండగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నాచేస్తున్నారు.
