Paritala Sriram : శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం.. ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఇదే..
Paritala Sriram : శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు.
Paritala Sriram
Paritala Sriram : ఏపీలో పలు జిల్లాల్లో జడ్పీ చైర్మన్, వైఎస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో భాగంగా.. శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్ గా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికై.. ప్రమాణ స్వీకారం చేశారు. పుట్టిపర్తిలోని రెవెన్యూ భవన్ లో ఈ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
Also Read : Nandamuri Alekhya : YS షర్మిల కూతురు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో నందమూరి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..
తొలుత జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత జడ్పీ చైర్మన్ పదవికి నామినేషన్లను ఆహ్వానిస్తూ కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. టీడీపీ అధిష్టానం జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ ను ప్రతిపాదిస్తూ ఆయనకు బీ-ఫామ్ అందజేశారు. దీంతో పరిటాల శ్రీరామ్ నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం తరువాత పరిటాల శ్రీరామ్ 10టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లాలోని జడ్పీటీసీలకు, తనకు సహకరించిన జిల్లాలోని కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు జడ్పీటీసీలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.
కూటమి పార్టీల్లోని నేతలందరినీ కలుపుకొని పోతూ.. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో ముఖ్యంగా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందేలా తన వంతు కృషి చేస్తానని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.
