KL Rahul History : ఒక్క అర్ధ సెంచరీతో చరిత్ర తిరగరాసిన కేఎల్ రాహుల్.. సచిన్, గంగూలీ, సెహ్వాగ్‌లకు సాధ్యం కాలేదు..
KL Rahul History : టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. సేనా దేశాల్లో టెస్టు క్రికెట్లో 50కి పైగా పరుగులు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు.
KL Rahul
KL Rahul History : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాల్లో టెస్టు క్రికెట్లో 50కి పైగా పరుగులు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు.
తొలి టెస్టులో భాగంగా న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జైస్వాల్ 89 బంతుల్లో 85 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. కేఎల్ రాహుల్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అర్ధ సెంచరీతో రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అర్ధ సెంచరీలు సాధించిన రాహుల్.. తాజాగా న్యూజిలాండ్‌లోనూ ఈ ఘనత సాధించాడు. దీంతో నాలుగు సేనా దేశాల్లోనూ టెస్టుల్లో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు.
ఇదిలా ఉంటే.. సేనా దేశాల్లో వన్డేల్లో ఈ ఘనత సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఉన్నారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు. కానీ, టెస్టు క్రికెట్లో మాత్రం తొలి భారత ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనతను సాధించాడు.
FIFTY BY KL RAHUL IN 99 BALLS.
– KLR going strong in the 1st innings, his first Test fifty against New Zealand. https://t.co/aKq37po7rh
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2026
మరోవైపు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ (17) రోహిత్ శర్మతో కలిసి ఐదో స్ధానంలో నిలిచాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్ (24) అగ్రస్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా (23), యశస్వి జైస్వాల్ (21), శుభ్‌మన్ గిల్ (19) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
