Mayookha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. బిగ్ బాస్ అమన్ కీలక పాత్రలో నటించిన సినిమా చూశారా?
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. (Mayookha)
Mayookha
Mayookha : పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా మయూఖ. ఇటీవల అక్టోబర్ 9న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది ఈ సినిమా. బిగ్ బాస్ ఫేమ్ అమన్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార, జాను వర్మ.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మాణంలో శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బిగ్ బాస్ అమన్ కీలక పాత్రలో నటించాడు.
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా నవంబర్ 20 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో మాత్రమే ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. అనంతరం నవంబర్ 23 నుంచి తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ఓటీటీలలోకి అందుబాటులోకి రానుంది. దీంతో ఈ సినిమాని ఓటీటీలో చూసేయొచ్చు.
Also Read : Upasana : పిఠాపురంలో మెగా కోడలు ఉపాసన.. మాజీ కేంద్రమంత్రితో కలిసి పిల్లల కోసం.. ఫొటోలు..
మయూఖ సినిమా ఇప్పటికే న్యూయార్క్, కేన్స్‌లో అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా మొదటి భాగం స్లో బర్న్ నేరేషన్‌తో సాగుతుంది. మలయాళ సినిమాల్లో కనిపించే కథన శైలిని గుర్తు చేస్తుంది. ప్రీ ఇంటర్వెల్‌కు చేరుకునే సమయానికి కథ పూర్తిగా కొత్త మలుపు తీసుకొని అక్కడి నుంచి సినిమా మరో స్థాయికి వెళ్తుంది. కథనంలో వేగంతో పాటు ఉత్కంఠ, అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను మరింత ఆసక్తికి గురిచేస్తాయి. రెండో భాగం ఇంటెన్స్ థ్రిల్లర్ అనుభూతిని అందిస్తుందని అన్నారు. అలాగే ఈ సినిమాలో అన్ని సినిమాల్లో కనిపించే లైటింగ్ పద్ధతులకు భిన్నంగా మోనోక్రోమాటిక్ లైటింగ్ ప్యాటర్న్‌ను ఉపయోగించినట్లు, సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యానికి తగ్గట్టుగా స్పానిష్, హాలీవుడ్, కొరియన్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందుతూ మయూఖ కథనం, సస్పెన్స్, విజువల్ ప్రెజెంటేషన్‌ను రూపొందించినట్లు దర్శకుడు తెలిపాడు. పేర్కొన్నారు.

