NZ vs IND : అదరగొట్టిన జైశ్వాల్, కేఎల్ రాహుల్.. కివీస్‌కు దీటుగా బదులిస్తున్న భారత్
NZ vs IND : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వెలింగ్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. రెండోరోజు ఆటలో భారత బ్యాటర్లు దీటుగా సమాధానం ఇచ్చారు.
Yashasvi Jaiswal, KL Rahul
NZ vs IND : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వెలింగ్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. రెండో రోజు (శుక్రవారం) ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 368 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన టీమిండియా బ్యాటర్లు కివీస్‌కు దీటుగా బదులిస్తున్నారు. దీంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ క్రీజులోకి వచ్చారు. జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని 85 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. జైస్వాల్ క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. దీంతో అతను 89 బంతుల్లో 85 పరుగులు చేయగా.. అందులో 16 ఫోర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ (52 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (16 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ జైస్వాల్ వికెట్ పడగొట్టాడు. భారత జట్టు ఇంకా 209 పరుగులు వెనుకంజలో ఉంది. కేఎల్ రాహుల్‌తోపాటు మిగిలిన ఆటగాళ్లు రాణిస్తే భారత జట్టు మూడోరోజు భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ జట్టు రెండోరోజు ఆటను 243/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించింది. మరో 125 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్(118) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, 94వ ఓవర్లో 286 పరుగుల వద్ద ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో ఫిలిప్స్ బౌల్డయ్యాడు. హెన్రీ నికోల్స్ (175 నాటౌట్ : 335 బంతుల్లో 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు 216 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో తొలి ఇన్నింగ్స్ లో జస్ర్పిత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు.
Team India fought back with both bat and ball, and now hold a slight edge in the contest. 💪
Watch the HERO VIDA India Tour of New Zealand, 1st Test Day 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/Wk6AigYYRw
— Sony Sports Network (@SonySportsNetwk) November 20, 2026
