IND vs NZ 1st Test : భారత బౌలర్ల దూకుడుకు చెక్ పెట్టిన హెన్రీ, ఫిలిప్స్.. ముగిసిన తొలిరోజు ఆట.. కివీస్ స్కోర్ ఎంతంటే?
IND vs NZ 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టులో భాగంగా తొలిరోజు (గురువారం)ఆటలో కివీస్ బ్యాటర్లదే పైచేయిగా నిలిచింది.
Henry Nicholls Jasprit Bumrah
IND vs NZ 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో క్రీజులోకి వచ్చిన కివీస్ బ్యాటర్లు తొలి సెషన్ లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయారు. కానీ, హెన్రీ నికోల్స్ (113 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (94 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో భారత బౌలర్ల దూకుడుకు అడ్డుకట్ట వేశారు.
Also Read : IND vs NZ : బుమ్రా మ్యాజిక్.. కివీస్ కెప్టెన్‌కు దిమ్మతిరిగింది.. బాబోయ్.. ఇదేం బౌలింగ్ సామీ.. వీడియో వైరల్
తొలిరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 82 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. క్రీజులో హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి ఆరో వికెట్‌కు 173 పరుగులు జోడించారు.. తద్వారా భారత బౌలర్లను విసిగించారు. అయితే, తొలి సెషన్లో నాలుగు వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా బౌలర్లు.. ఆ తరువాత రెండు సెషన్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగారు. మొత్తంలో తొలిరోజు ఆటలో తొలి రెండు సెషన్లలో భారత్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించగా.. చివరి రెండు సెషన్లలో న్యూజిలాండ్ బ్యాటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.
Henry Nicholls brings up a sensational hundred when New Zealand needed it most! 💯👌
Watch the HERO VIDA India Tour of New Zealand, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/2AxoMVWUFS
— Sony Sports Network (@SonySportsNetwk) November 19, 2026
ఈ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా అద్భుత బంతులతో కివీస్ బౌలర్లకు వణుకు పెట్టించాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ కెప్టెన్ టామ్ లేథమ్ (0) డారిల్ మిచెల్ (1), టామ్ బ్లన్‌డెల్ (5)ను బుమ్రా పెలివియన్ బాట పట్టించాడు. అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ లు చెరో వికెట్ పడగొట్టారు. డెవన్ కాన్వే (4) వికెట్ ను అన్షుల్ కాంబోజ్ తీసుకోగా.. రచిన్ రవీంద్ర (15) వికెట్ ను ఆకాశ్ దీప్ పడగొట్టాడు.
The afternoon brought a change in momentum and a partnership that refused to break!
Here’s how the action unfolded after lunch.
Watch the HERO VIDA India Tour of New Zealand, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/uf0OYtkjow
— Sony Sports Network (@SonySportsNetwk) November 19, 2026
