Samantha : డెలివరీకి ముందు అత్తారింట్లో సమంతకి చేసిన వేడుక ఇదే.. ఇదేం సంప్రదాయం?
తాజాగా సమంతకు అత్తారింట్లో మరోసారి స్పెషల్ వేడుక నిర్వహిచిన ఫోటోలు షేర్ చేయడంతో ఇదేమయి ఉంటుంది అని చర్చగా మారింది. (Samantha)
Samantha
Samantha : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి, ఆ తర్వాత వేడుకలు అన్ని కాస్త భిన్నంగా కొత్త సాంప్రదాయాలతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్లో భూత శుద్ధి వివాహ పద్ధతిలో సమంత-రాజ్ పెళ్లి చేసుకున్నారు. 2026లో కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో సమంతకు శ్రీవిద్య సంప్రదాయం ప్రకారం కళా ఆవరణ అనే ప్రత్యేక సీమంతం వేడుకను నిర్వహించారు. తాజాగా సమంతకు అత్తారింట్లో మరోసారి స్పెషల్ వేడుక నిర్వహిచిన ఫోటోలు షేర్ చేయడంతో ఇదేమయి ఉంటుంది అని చర్చగా మారింది.
సమంతకు నిర్వహించిన వేడుక గురించి రాజ్ నిడిమోరు సోదరి శీతల నిడిమోరు తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. బాబూ, మనం ఇది ఎప్పుడు చేయగలం అని నేను చాలా కాలంగా మా అన్నయ్య(రాజ్ నిడిమోరు)ను అడుగుతూనే ఉన్నాను. చివరికి ఆ సమయం వచ్చింది. మమ్మల్ని పెంచడంలో సహాయపడిన మా పిన్నిలు, పెద్దమ్మలు ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’ వేడుక కోసం దూరం నుండి వచ్చారు. సమంతను, త్వరలో మా సామ్రాజ్యాన్ని ఏలబోతున్న ఆ బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారు.
Also Read : Sanjay Dutt : గత జన్మ జ్ఞాపకాలు పంచుకున్న సంజయ్ దత్.. అశోక రాజ్యంలో రాజు.. భార్య, మంత్రి మోసం చేయడంతో..
మా కుటుంబంలో, ఇంటి పూజా మందిరం దగ్గర అందరం చేరి జపించడం, పాడటం నిత్యం చేస్తూ ఉంటాం. మేము మా తాతయ్య, నానమ్మలతో, అత్తయ్యలతో కలిసి అలా చేస్తూ పెరిగాము. ఆ రోజు ఏం జరిగినా మేమందరం కలిసి ప్రార్థనలో కూర్చునేవాళ్ళం. అది మా ఇంటికి, మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అది ఇప్పుడు మా బంధువులలో సజీవంగా ఉండటం చూశాను. వాళ్లంతా మళ్ళీ ఒకచోట చేరి జపిస్తూ, పాడుతూ, స్నేహితురాళ్ళలా నవ్వుతూ నా సోదరుడిని, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈసారి సమంత, పుట్టబోయే బిడ్డ కు కూడా ఆ ఆప్యాయత ను పంచుతున్నారు. మేము శ్రీ సూక్తం, గాయత్రీ దేవి హోమం చేసి 21 సార్లు గాయత్రీ నామాన్ని జపించి మా కుటుంబ ప్రార్థనలు చేసాము.
ఆ తర్వాత సమంత కోసమే పద్మశ్రీ శోభారాజు పిన్ని ఓ చక్కని పాట స్వరపరిహీ పాడారు. అందరం తోడవ్వగా మాది ఒక చిన్న కుటుంబ ప్రదర్శనలా సాగింది. ఎంతోమంది తల్లులు సమంతను ఆశీర్వదించడం చూడటం నేను ఆశించినదానికంటే ఎక్కువే. చిన్నారి.. నువ్వు పుట్టకముందే ఎంత ప్రేమను ఒకచోట చేర్చావో చూడు. సమంత సుఖ ప్రసవం, క్షేమం కోసం, బిడ్డ మంచి నడవడిక, సార్థకతతో నిండిన దీర్ఘ ఆరోగ్యకరమైన జీవితం కోసం మేము మీ ఆశీస్సులు కోరుకుంటున్నాము అని పోస్ట్ చేసింది.
