AP Parishad Election: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలు.. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్(AP Parishad Election) ఎన్నికల 2026 నేపథ్యంలో రాష్ట్రంలోని 27 జిల్లాల చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ అధికారికంగా విడుదల చేసింది.
Ap zilla parishad elections 2026 tdp releases 27 districts chairman vice chairman candidates list
AP Parishad Election: ఆంధ్రప్రదేశ్‌లో 2026 జిల్లా పరిషత్ (జెడ్పీ) ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని మొత్తం 27 జిల్లా పరిషత్‌లకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఖరారైన అభ్యర్థుల పూర్తి జాబితాను పార్టీ జాతీయ కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం, సంతకంతో ఈ జాబితాను ప్రకటించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ, మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీలకు పలు జిల్లాల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కేటాయిస్తూ ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు.
మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలు ఇవే.. జనసేనకు 4 చైర్మన్, 5 వైస్ చైర్మన్ పదవులు:
కూటమి సర్దుబాట్లలో భాగంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల జెడ్పీ చైర్మన్(AP Parishad Election) పదవులను జనసేన పార్టీకి కేటాయించగా, కృష్ణా జిల్లా చైర్మన్ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అలాగే తూర్పు గోదావరి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల వైస్ చైర్మన్ పదవులను జనసేనకు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల వైస్ చైర్మన్ స్థానాలను బీజేపీకి కేటాయిస్తూ టీడీపీ జాబితాలో స్పష్టం చేసింది.
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు ఖరారైన టీడీపీ అభ్యర్థులు వీరే:
మిగిలిన స్థానాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల విషయానికొస్తే.. విజయనగరం చైర్మన్‌గా మజ్జి సిరి సహస్త్ర, వైస్ చైర్మన్‌గా పసల నీరజ; విశాఖపట్నం చైర్మన్‌గా గాడు అలివేణి, వైస్ చైర్మన్‌గా సుకవాసి అజయ్ ఎ.ఎన్.; పోలవరం చైర్మన్‌గా వంతల రాజేశ్వరి, వైస్ చైర్మన్‌గా తీగల ప్రభ ఎంపికయ్యారు. తూర్పు గోదావరి చైర్మన్‌గా కాడ పద్మ, కోనసీమ చైర్మన్‌గా గొల్లపల్లి అమూల్య, పశ్చిమ గోదావరి చైర్మన్‌గా ఇందుకూరి రామకృష్ణంరాజు, వైస్ చైర్మన్‌గా సిరగాని నాగేశ్వరరావు; ఏలూరు చైర్మన్‌గా చింతమనేని సాయి నవ్యశ్రీ, వైస్ చైర్మన్‌గా బొర్రా చలమయ్య పేర్లను ప్రకటించారు. కృష్ణా జిల్లా వైస్ చైర్మన్‌గా దండమూరి పూజిత, ఎన్టీఆర్ చైర్మన్‌గా కోట పుల్లమ్మ, గుంటూరు చైర్మన్‌గా ధార అరుణ, వైస్ చైర్మన్‌గా తల్లా అశోక్ కుమార్; పల్నాడు చైర్మన్‌గా పుచ్చకాయల రమాదేవి, వైస్ చైర్మన్‌గా నల్లపాటి కీర్తన; బాపట్ల చైర్మన్‌గా పుప్పడపు రోహిణి, ప్రకాశం చైర్మన్‌గా కొక్కిలిగడ్డ ప్రభాకరరావు; మార్కాపురం చైర్మన్‌గా కందుల రామిరెడ్డి, వైస్ చైర్మన్‌గా జి.వి. శ్రీనివాస వర్మలను ఖరారు చేశారు.
నెల్లూరు, రాయలసీమ జిల్లాల అభ్యర్థుల తుది జాబితా:
నెల్లూరు, రాయలసీమ జిల్లాల విషయానికొస్తే.. నెల్లూరు చైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైస్ చైర్మన్‌గా పొట్టెల్ల ప్రసాద్; కర్నూలు చైర్మన్‌గా చూడి ఉలిగయ్య, వైస్ చైర్మన్‌గా షేక్ షాదిక; నంద్యాల చైర్మన్‌గా షేక్ బ్రుహానుద్దీన్, వైస్ చైర్మన్‌గా కె. శ్రీకాంత్ రెడ్డి; అనంతపురం చైర్మన్‌గా గంజే నాగరాజు, వైస్ చైర్మన్‌గా చెన్నపూస లలిత; శ్రీ సత్యసాయి చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ పేర్లను ప్రకటించారు. వైఎస్సార్ కడప చైర్మన్‌గా పుత్తా నరసింహారెడ్డి, వైస్ చైర్మన్‌గా హబీబున్నిసా చాంద్ బాయి గారి; అన్నమయ్య చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు, వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య; తిరుపతి చైర్మన్‌గా హేమలత; చిత్తూరు చైర్మన్‌గా మాదళం శైలజ, వైస్ చైర్మన్‌గా ఎస్. మంజుప్రియ వెంకటేష్‌లను అభ్యర్థులుగా ఖరారు చేస్తూ చంద్రబాబు నాయుడు జాబితాపై సంతకం చేశారు.

