Apple iPhone 18 Launch : వావ్.. ఐఫోన్ 18, ఎయిర్ 2 వచ్చేస్తున్నాయ్.. ఈసారి ఆపిల్ ఇవ్వబోయే సర్ప్రైజ్లు ఇవే!
Apple iPhone 18 Launch : ఐఫోన్ 18, ఐఫోన్ ఎయిర్ 2 త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రానున్నాయా? 6.3 అంగుళాల డిస్ప్లే, A20 చిప్సెట్, 3,500mAh బ్యాటరీ సహా కొత్త ఫోన్ల ఫీచర్లపై ఆసక్తికరమైన వివరాలివే..
Apple iPhone 18 Launch
- ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..
- త్వరలో ఐఫోన్ 18, ఎయిర్ 2 ఎంట్రీ
- సన్నని డిజైన్.. భారీ బ్యాటరీ అప్‌గ్రేడ్
- 9GB ర్యామ్.. 3,500mAh బ్యాటరీ
Apple iPhone 18 Launch : ఆపిల్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే బంపర్ అప్డేట్స్.. ఐఫోన్ 18తో పాటు ఐఫోన్ ఎయిర్ 2ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆపిల్ రెడీ అవుతున్నట్టు టెక్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఈ 2 ఐఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..
ఐఫోన్ 18లో అదిరిపోయే ఫీచర్లు :
ఐఫోన్ 18 విషయానికి వస్తే.. ఇందులో 6.3 అంగుళాల ప్రోమోషన్ డిస్ప్లే ఉండవచ్చని అంచనా. డిస్ప్లే ప్యానెళ్ల తయారీ కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ ఫోన్‌కు శాంసంగ్ డిస్ప్లే, ఎల్జీ డిస్ప్లే సంస్థలు ప్యానెళ్లను సరఫరా చేస్తుందని తెలిసింది..
ఇక పనితీరు విషయానికి వస్తే.. A20 చిప్సెట్తో పాటు 9GB ర్యామ్ ఉండవచ్చని అంచనా.. బ్యాక్ సైడ్ 48MP ప్రైమరీ కెమెరా, మరో 48MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీల కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు..
ఎయిర్ 2లో బ్యాటరీ అప్‌గ్రేడ్ :
మరోవైపు ఐఫోన్ ఎయిర్ 2 కూడా కొన్ని ఆసక్తికరమైన మార్పులతో రానుందని సమాచారం.. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో ఆపిల్ కీలక అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలుస్తోంది.. ప్రస్తుతం ఐఫోన్ ఎయిర్‌లో 3,149mAh బ్యాటరీ ఉండగా, కొత్త మోడల్లో దాదాపు 3,500mAh బ్యాటరీ ఇవ్వవచ్చని అంచనా..
దీంతో పాటు 6.55 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 48MP ప్రైమరీ కెమెరా, కొత్త అల్ట్రా వైడ్ కెమెరా ఉండవచ్చని టాక్.. ఈ ఐఫోన్ మందం సుమారు 5.2 మిల్లీమీటర్లుగా ఉండవచ్చని సమాచారం. టైటానియం ఫ్రేమ్‌ను కూడా కొనసాగించే అవకాశం ఉంది..
అయితే, గత ఐఫోన్ ఎయిర్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఎయిర్ 2 తయారీ పరిమాణాన్ని తగ్గించే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ 2 ఐఫోన్లపై ఆపిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..
