EPFO New Rules 2026 : PF ఉన్నవారికి డబుల్ ధమాకా.. ఇక 90 శాతం డబ్బులు తీసుకోవచ్చు.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్..
EPFO New Rules 2026 : పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ 2 భారీ శుభవార్తలు చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా పరిమితిని 90 శాతానికి పెంచడంతో పాటు ఉద్యోగం మానేసిన 2 నెలలకే పూర్తి డబ్బులు తీసుకునే అవకాశం కల్పించింది. కొత్త రూల్స్ వివరాలివే..
EPFO New Rules 2026
- ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్
- పీఎఫ్ ఖాతాదారులకు పండగే..
- కొత్త విత్‌డ్రా రూల్స్‌తో భారీ ఊరట
EPFO New Rules 2026 : ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ పీఎఫ్ (PF) అనేది భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పొదుపు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో ఆ డబ్బులు అవసరమైనప్పుడు ఎంత తీసుకోవాలనే విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి.
కానీ, తాజాగా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. నవంబర్ 19న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో 2 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.
90 శాతం వరకు పీఎఫ్ విత్‌డ్రా :
ఇప్పటివరకు అర్హులైన ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్ఠంగా 75 శాతం వరకు మాత్రమే ముందస్తుగా తీసుకునే అవకాశం ఉండేది. తాజాగా ఖాతాలో తప్పనిసరిగా ఉంచాల్సిన కనీస బ్యాలెన్స్ 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. దీంతో 55 ఏళ్లలోపు సభ్యులు అర్హతలు, నిబంధనలకు లోబడి తమ పీఎఫ్ నిధుల్లో 90 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.. అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు ఉద్యోగులకు ఎంతో వినియోగపడుతుంది..
ఉద్యోగం మానేసిన 2 నెలలకే ఫుల్ సెటిల్మెంట్ :
నిరుద్యోగులైన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం ఊరటనివ్వనుంది. గతంలో ఉద్యోగం మానేసిన తర్వాత పూర్తి పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి 12 నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ గడువును మళ్లీ 2 నెలలకు తగ్గించారు. అంటే.. ఉద్యోగం మానేసి వరుసగా 2 నెలలు నిరుద్యోగిగా ఉన్న తర్వాత నిబంధనల ప్రకారం పూర్తి పీఎఫ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు..
రిటైర్మెంట్ తర్వాత నెలనెలా డబ్బులు :
ఇక రిటైర్మెంట్ చేసినవారికి కూడా ఈపీఎఫ్ఓ మరో మంచి అవకాశం కల్పించనుంది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ద్వారా పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా నెలవారీ, 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి వాయిదాల రూపంలో తీసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై వర్తించే పీఎఫ్ వడ్డీ కొనసాగుతుంది..
అయితే, ఈ మార్పులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, అమలు మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈపీఎస్ కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అంశంపై మాత్రం ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. మొత్తంగా ఈ కొత్త నిర్ణయాలు పీఎఫ్ ఖాతాదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నాయి.
