Rashmika Mandanna : అత్తమ్మతో కలిసి పుట్టపర్తిలో రష్మిక.. శ్రీ సత్యసాయి బాబా గురించి ఏం మాట్లాడిందంటే..
తాజాగా నేడు పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలకు రష్మిక తన అత్తమ్మతో కలిసి హాజరైంది. (Rashmika Mandanna)
Rashmika Mandanna
Rashmika Mandanna : విజయ్ దేవరకొండ ఫ్యామిలీ పుట్టపర్తి సత్యసాయి బాబాని కొలుస్తారని తెలిసిందే. విజయ్,ఆనంద్ ఇద్దరూ చిన్నప్పుడు అక్కడే చదువుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత కూడా విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి పుట్టపర్తి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాజాగా నేడు పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలకు రష్మిక తన అత్తమ్మతో కలిసి హాజరైంది.
Also Read : Rayancha Kokkura : షూటింగ్ సెట్లో క్యూట్ గా ఫోటోలు దిగిన హీరోయిన్ రాయంచ..
ఈ కార్యక్రమంలో రష్మిక మాట్లాడుతూ.. నా భర్త విజయ్ దేవరకొండ, కుటుంబ సభ్యుల ద్వారా స్వామివారి బోధనలతో పరిచయం ఏర్పడింది. విజయ్, ఆనంద్ దేవరకొండ ఇద్దరూ స్వామి విద్యార్థులు. మా అత్తయ్య, మామయ్య ఇద్దరూ స్వామికి వీర భక్తులు. సత్యసాయి బాబా బోధనలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. స్వామి కథలు, బోధనలు మన మధ్య ఉండటంతో స్వామి మాటలతో బాగా కెనెక్ట అయ్యాను. స్వామివారి మాటలు కేవలం మాటలు కాదు, అవి జీవన విధానం. ఆ మాటలు నన్ను చాలా ప్రభావితం చేసాయి.
కొన్ని వారాల క్రితం ఈ కార్యక్రమంలో పాల్గొనమని పుట్టపర్తికి రమ్మని ఆహ్వానం వచ్చింది. స్వామి ఒక అడుగు మీరు నా వైపు వస్తే నేను వంద అడుగులు మీ వైపు వేస్తానని చెప్పారు. మహిళలు ఆధ్యాత్మికంగా, మానసికంగా బలంగా ఉండాలని స్వామి ఆకాంక్షించారు అని తెలిపింది.
