Rashmika Mandanna : ‘మైసా’ కోసం రష్మిక కష్టం.. స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్..
తాజాగా రష్మిక మైసా సినిమా కోసం పడిన కష్టాన్ని ఓ వీడియో రూపంలో రిలీజ్ చేసారు. (Rashmika Mandanna)
Rashmika Mandanna
Rashmika Mandanna : రష్మిక మొదటిసారి ఫుల్ యాక్షన్స్ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా మైసా. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నవంబర్ 27న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమా కోసం రష్మిక బాగా కష్టపడింది అని ఇప్పటికే పలుమార్లు తెలిపింది మూవీ టీమ్. ఈ క్రమంలో ఆమెకు చాలా గాయాలు కూడా అయ్యాయి. తాజాగా రష్మిక మైసా సినిమా కోసం పడిన కష్టాన్ని ఓ వీడియో రూపంలో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో రష్మిక, దర్శకుడు రవీంద్ర మాట్లాడుతూ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని వివరించారు.
Also Read : Samantha : డెలివరీకి ముందు అత్తారింట్లో సమంతకి చేసిన వేడుక ఇదే.. ఇదేం సంప్రదాయం?
బ్యాంకాక్ లో ఓ నెల రోజుల పాటు దాదాపు రోజుకు 10 గంటలు పలు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంది రష్మిక. ఆ ట్రైనింగ్ లో రష్మిక కష్టపడిన కొన్ని విజువల్స్ ని ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. అలాగే షూటింగ్ లో కూడా రష్మిక యాక్షన్ ప్రాక్టీస్ ని చూపించారు. ఈ వీడియో చూస్తుంటే రష్మిక ఈ సినిమా కోసం చాలానే కష్టపడినట్టు తెలుస్తుంది. ఇది ఎపిసోడ్ 1 అని రిలీజ్ చేసారు. రష్మిక పడిన కష్టాన్ని రిలీజ్ లోపు పలు ఎపిసోడ్స్ గా మూవీ టీమ్ వీడియోలు రిలీజ్ చేయబోతోందని తెలుస్తుంది.
మీరు కూడా రష్మిక మైసా కోసం పడిన కష్టం చూసేయండి..
