ENE Repeat : ఆర్జీవీ జస్ట్ మిస్.. ఆ డైరెక్టర్స్‌తో ఆయన కూడా ఉండుంటే వేరే లెవల్.. తరుణ్ భాస్కర్ ఏం చెప్పాడంటే..
ఈ గెస్ట్ రోల్స్ దర్శకుల లిస్ట్ లో ఆర్జీవీ కూడా ఉన్నాడట. (ENE Repeat)
ENE Repeat
ENE Repeat : ఇటీవలే తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజే 15 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో చాలా మంది స్టార్ దర్శకులు, పలువురు సినీ ప్రముఖులు గెస్ట్ రోల్స్ చేసి నవ్వించారు.
ఈ నగరానికి ఏమైంది సినిమాలో OG డైరెక్టర్ సుజీత్, డైరెక్టర్ కరుణ్ కుమార్, డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్, డైరెక్టర్ అనుదీప్, సందీప్ రెడ్డి వంగ, అనిల్ రావిపూడి, నందిని రెడ్డి.. లు గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసారు. అయితే ఈ గెస్ట్ రోల్స్ దర్శకుల లిస్ట్ లో ఆర్జీవీ కూడా ఉన్నాడట.
Also See : Jabardasth Babu : యాంకర్ని ప్రేమ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. ఫొటోలు వైరల్..
నలుగురు హీరోలలో ముగ్గురు ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసినట్టు క్లైమాక్స్ లో చూపించారు. విశ్వక్ ని అయితే అలా చూపించలేదు. దీనిపై సక్సెస్ ఈవెంట్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ తో రామ్ గోపాల్ వర్మ సర్ చేయాలి. మేము మాట్లాడాము కూడా. కానీ సెన్సార్ కి 15 రోజుల ముందే సబ్మిషన్ ఇవ్వాలని చెప్పడంతో డేట్స్ ఇష్యూస్ వాళ్ళ ఆర్జీవీ సర్ కి కుదర్లేదు. లేకపోతే ఆర్జీవీ క్యామియో కూడా ఉండేది అని అన్నారు.
దీంతో ఆర్జీవీ ఫ్యాన్స్, ఈ నగరానికి ఏమైంది ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఆర్జీవీ కూడా ఉండుంటే సినిమా వేరే లెవల్ కి వెళ్ళేది అని అంటున్నారు. ఇంతమంది దర్శకులతో పాటు ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, సింగర్ శ్రీరామచంద్ర, రాజీవ్ కనకాల కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. విజయ్ దేవరకొండని కూడా గెస్ట్ గా ట్రై చేసారు కానీ కుదర్లేదు.
