Osey Ramulamma : రష్మిక కోసం ‘ఒసేయ్ రాములమ్మ’ సాంగ్ రీమిక్స్.. ‘మైసా’ సాంగ్ అదిరిందిగా..
రష్మిక మైసా నుంచి వచ్చిన ఒసేయ్ రాములమ్మ సాంగ్ వినేయండి..(Osey Ramulamma)
Osey Ramulamma
Osey Ramulamma : రష్మిక మొదటిసారి ఫుల్ యాక్షన్స్ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా మైసా. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నవంబర్ 27న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటని రిలీజ్ చేసారు. ఒకప్పుడు విజయశాంతి ఒసేయ్ రాములమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరిలోకి తెలిసిందే. ఇప్పటికి ఆ పాటకి ఒక మంచి వైబ్ ఉంది. ఇప్పుడు రష్మిక మందన్న మైసా సినిమా కోసం కోసం ఒసేయ్ రాములమ్మ సాంగ్ ని రీమిక్స్ చేసారు.
Also See : Nandamuri Alekhya : YS షర్మిల కూతురు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో నందమూరి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..
అప్పుడు ఈ పాటని రాసిన సుద్దాల అశోక్ తేజ్, పాడి కంపోజ్ చేసిన వందేమాతరం శ్రీనివాస్ మరోసారి వాళ్లే ఈ రీమిక్స్ సాంగ్ ని కూడా కంపోజ్ చేసి పాడారు. దీంతో ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది. ఒరిజినల్ సాంగ్ కి ఏ మాత్రం తగ్గకుండా రష్మిక యాక్షన్స్ కి ఈ ఒసేయ్ రాములమ్మ సాంగ్ పర్ఫెక్ట్ గా సరిపోయింది అని అంటున్నారు. మీరు కూడా రష్మిక మైసా నుంచి వచ్చిన ఒసేయ్ రాములమ్మ సాంగ్ వినేయండి..
