Tollywood : హిట్ టాక్ వచ్చినా.. నో రష్.. నో కలెక్షన్స్
Tollywood : కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.
Tollywood Positive Talk But No Box Office Collections
Tollywood : కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్నింటికి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కనిపించడం లేదట.
హిట్ టాక్ వస్తున్నా హౌస్‌ఫుల్స్ మాత్రం పడట్లేదట. సోషల్ మీడియాలో సినిమా బాగుందంటూ పోస్టులు, రివ్యూలు, ప్రశంసలు కనిపిస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ సందడి లేదంటున్నారు. దీంతో అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదా.? లేక సినిమాలపై ఆసక్తి తగ్గిందా.? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. ఒకప్పుడు పాజిటివ్ టాక్ వస్తే రెండో రోజు నుంచి కలెక్షన్లు పుంజుకునేవి. ఇప్పుడు మాత్రం టాక్ బాగున్నా కలెక్షన్లు పెరగపోవడం ట్రేడ్ వర్గాలను ఆలోచనలో పడేస్తోందట.
మరోవైపు సినిమాల విషయంలో ఆడియన్స్ టేస్ట్ కూడా మారిపోతోంది. ఏ సినిమా పడితే ఆ సినిమా కోసం థియేటర్‌కు వెళ్లి చూసేందుకు ఇష్టపడని పరిస్థితి. కంటెంట్‌లో కొత్తదనం, భారీ ప్రమోషన్లు, స్టార్ కాస్టింగ్, బలమైన కథనం ఉంటేనే థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు. మిగతా సినిమాలను ఓటీటీలో చూద్దాంలే అనే ఆలోచన పెరిగిపోయిందంటున్నారు.
దీనికి తోడు టికెట్ ధరలు, కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే అయ్యే ఖర్చు కూడా ప్రేక్షకులను వెనక్కి లాగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్లో ప్రస్తుతం హిట్ టాక్‌కు, థియేటర్ ఆక్యుపెన్సీకి పొంతన లేకుండా పోతోంది. సినిమా బాగుందని చెప్పేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ టికెట్ కొనుక్కుని థియేటర్‌కు వచ్చేవాళ్లే కనిపించడం లేదంటున్నారు. మరి ఇది తాత్కాలిక పరిస్థితా.? లేక తెలుగు సినిమా మార్కెట్లో వస్తున్న పెద్ద మార్పునకు సంకేతమా.? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
