Vishwak Sen : ఏపీలో అర్నబ్ తుఫాన్.. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసిన విశ్వక్ సేన్.. వీడియో వైరల్..
ఈ అర్నబ్ ఎఫెక్ట్ సినిమాల మీద కూడా పడింది. (Vishwak Sen)
Vishwak Sen
Vishwak Sen : అర్నబ్ తుపాను ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. కుండపోత వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఈ అర్నబ్ ఎఫెక్ట్ సినిమాల మీద కూడా పడింది.
అర్నబ్ ఎఫెక్ట్ తో హీరో విశ్వక్ సేన్ తన కల్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసినట్టు ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
Also Read : Ah Movie : వాయిదా పడ్డ ‘అ’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
ఈ వీడియోలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. కల్ట్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు. ఏపీలో అర్నబ్ తుఫాన్ భీభత్సమ్ సృష్టిస్తుంది. ఇలాంటి కష్ట సమయంలో అక్కడ ఉన్న ఫ్యామిలీలకు సపోర్ట్ గా ఉండాలి. అది మన బాధ్యత. వాళ్లకు సపోర్ట్ గా నిల్చుంటూ మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నాము. అక్టోబర్ 30న సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఒక ఫార్మల్ ప్రెస్ మీట్ మాత్రం రేపు పెడతాము. ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాము. ఇలాంటి కష్ట సమయంలో తుఫాన్ లో ఎఫెక్ట్ అయిన వారి కోసం నిలబడదాం అని తెలిపారు. దీంతో కల్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే రిలీజ్ కానుంది.
