Itlu Arjuna : ఇండస్ట్రీ అంతా అయిపోయింది.. ఇప్పుడు మెగాస్టార్.. ఇట్లు అర్జున సక్సెస్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ?
ఇండస్ట్రీ అంతా ఈ కొత్త హీరోకి సపోర్ట్ వచ్చింది. సినిమాని కూడా భారీగా రిలీజ్ చేసారు. ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఏకంగా చిరంజీవి రాబోతున్నారు. (Itlu Arjuna)
Itlu Arjuna
Itlu Arjuna : ఇటీవల అనీష్ రెడ్డి అనే కొత్త హీరో ఇట్లు అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. సినిమా చాలా బాగున్నా కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గానే ఉన్నాయి. అయితే అనీష్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత కొడుకు కావడంతో అతని మొదటి సినిమా అని సపోర్ట్ గా ఇండస్ట్రీ అంతా తరలి వచ్చింది.
ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేసి, ఇంటర్వ్యూ చేసాడు. నాగార్జున సినిమా రిలీజ్ చేసి ప్రతి ప్రెస్ మీట్ కి వచ్చాడు. రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు. అనిరుద్ పాట పాడాడు. తమన్ ప్రతి ఈవెంట్ కి హాజరయ్యాడు. అఖిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు. వెంకటేష్, నాగచైతన్య, నితిన్, పలువురు హీరోలు ప్రీమియర్ షోకి వచ్చారు. ఇలా ఇండస్ట్రీ అంతా ఈ కొత్త హీరోకి సపోర్ట్ వచ్చింది. సినిమాని కూడా భారీగా రిలీజ్ చేసారు. ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఏకంగా చిరంజీవి రాబోతున్నారు.
Also See : Aadya : ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన పవన్ కళ్యాణ్ కూతురు.. ఆద్య లేటెస్ట్ ఫొటోలు వైరల్..
ఇట్లు అర్జున సక్సెస్ మీట్ నేడు నవంబర్ 17న హైదరాబాద్ లోని ఆవాసా హోటల్ లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఈ సక్సెస్ మీట్ కి చిరంజీవి గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. మొత్తానికి ఈ కొత్త హీరో కోసం ఇండస్ట్రీ అంతా తరలి వచ్చింది. మంచి ల్యాండింగ్ అయితే పడింది అనీష్ కి. మరి భవిష్యత్తులో వరుసగా సినిమాలు చేస్తాడా లేదా చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనశ్వర రాజన్ చిరంజీవి కాకా సినిమాలో మెగాస్టార్ కూతురుగా నటిస్తుంది. దీంతో ఈ సక్సెస్ మీట్ లో కాకా గురించి ఏమైనా మాట్లాడతారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

