Gold Loan : పడిసి ధర పతనం.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాకిస్తున్న బ్యాంకులు.. కట్టాల్సిందే..!
Gold Loan : బంగారం ధరలు తగ్గుతున్నాయని కొనుగోలుదారులు సంతోషపడుతూ ఉంటే పసిడి తనకా పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు మొదలయ్యాయి.
Gold Loan
Gold Loan Borrowers : బంగారం ధరలు తగ్గుతున్నాయని కొనుగోలుదారులు సంతోషపడుతూ ఉంటే పసిడి తనకా పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు మొదలయ్యాయి. ధరలు భారీగా పడిపోవడంతో బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. అప్పుగా తీసుకున్న మొత్తానికి తనకా పెట్టిన బంగారం విలువకు మధ్య వ్యత్యాసం పెరగడంతో రుణ గ్రహీతలకు మార్జిన్ కాల్స్‌తో నోటీసులు పంపిస్తున్నారు. అదనంగా నగదు జమ చేయాలని లేదంటే మరికొంత బంగారం తనకా పెట్టాలని కోరుతున్నారు.
Also Read : Gold Silver Prices Today : బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఒక్కరోజులోనే భారీ మార్పులు.. నేటి ధరలు ఇవే..
గడిచిన 11 నెలల్లోనే బంగారం ధర 60,000కు పైగా తగ్గడంతో బ్యాంకులు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నాయి. బంగారం భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఆపద సమయంలో ఆదుకొనే ఆర్థిక భరోసా కూడా. అవసరమైతే నగలు బ్యాంకుల్లోనూ, ఫైనాన్స్ సంస్థల్లోనూ తనకా పెట్టి అప్పు తీసుకుంటూ ఉంటారు. అలా బంగారంపై రుణాలు ఇవ్వడం దేశంలో భారీ వ్యాపారంగా ఎదిగింది. అయితే, ఇప్పుడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ వ్యాపారానికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.
పసిడి ధరలు పైపైకి వెళ్ళినప్పుడు బంగారంపై రుణాలు తీసుకున్న వారికి భారీగా నగదు అందింది. కానీ, ఇప్పుడు అదే బంగారం ధరలు దిగిరావడంతో రుణ గ్రహీతలకు కష్టాలు మొదలయ్యాయి. బంగారం తనకా పెట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తమయ్యాయి. అప్పు ఇచ్చినప్పుడు ఉన్న బంగారం విలువ ఇప్పుడు తగ్గిపోవడంతో రుణాల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ ధరలు తగ్గడంతో బ్యాంకులు రుణ గ్రహీతలకు మార్జిన్ కాల్ నోటీసులు పంపిస్తున్నాయి. తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లించాలని కోరుతున్నారు. లేదంటే అధనంగా బంగారాన్ని తనకా పెట్టాలి అని సూచిస్తున్నారు. ధర తగ్గిన మేరకు రుణ మొత్తాన్ని తగ్గించుకోవాలని కొంత నగదును వెంటనే జమ చేయాలని కోరుతున్నారు. అంటే అప్పు తీసుకున్నప్పుడు ఉన్న లెక్కలు ఇప్పుడు మారిపోవడంతో ఖాతాదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.
ఇక బంగారం ధరలో ఈ ఎడాది భారీగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. జనవరిలో 10గ్రాముల బంగారం ధర రూ.1,85,000 మార్కును తాకింది. అలాగే ఫిబ్రవరి ప్రారంభంలో 1,40,000కు పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పుంజుకొని రూ.1,72,000కు చేరుకుంది. అనంతరం మరోసారి తగ్గుతూ వచ్చింది. ఇక ఆగస్టు చివరి వారం వరకు పెరుగుతూ వచ్చిన పసిడి ధర.. అక్కడి నుంచి మళ్ళీ పతనం బాటుపట్టింది. నవంబర్ ప్రారంభంలో రూ.1,50,000 స్థాయికి తగ్గగా తర్వాతి 20 రోజుల్లోనే రూ. 1, 25,000కు చేరింది. మొత్తంగా 11 నెలల్లో వ్యవధిలో రూ.60,000కుపైగా తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక భవిష్యత్తులో తులం ధర లక్ష రూపాయలకు చేరవచ్చన్న అంచనాలు రుణ సంస్థల్లో మరింత ఆందోళన పెంచుతున్నాయి.
సాధారణంగా బ్యాంకులు తనకా పెట్టి బంగారం విలువలో 75శాతం నుంచి 80శాతం వరకు రుణంగా ఇస్తూ ఉంటారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. రుణ పరిమాణాన్ని బట్టి ఈ పరిమితులు మారుతాయి. అయితే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బ్యాంకులు ఇచ్చిన రుణాలకు ప్రస్తుతం తనకా బంగారం విలువకు మధ్య వ్యత్యాసం తగ్గిపోయింది. దీనికి వడ్డీ కూడా తోడవుతుంది. ఒకవేళ రుణగ్రహీతలు అప్పు చెల్లించకపోతే తనకా బంగారాన్ని వేలం వేసిన ఇచ్చిన మొత్తాన్ని పూర్తిగా రికవరీ చేయలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
అందుకే బ్యాంకులు ముందుగానే అప్రమత్తమయ్యాయి. మార్జిన్ కాల్స్ ద్వారా రుణ గ్రహీతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక మరోవైపు బంగారం ధరలు మరింత తగ్గితే కొంతమంది రుణ గ్రహీతులు అప్పు చెల్లించకుండా తనకా పెట్టిన ఆభరణాలు వదిలేసే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా బ్యాంకుల్లో వ్యక్తమవుతుంది. ఇక ఈ పరిస్థితుల్లో వేలం ద్వారా రుణాన్ని రికవరీ చేసుకోవడం కూడా కష్టంగా మారొచ్చు.
