Guntur Mayor : గుంటూరు మేయర్గా కోవెలముడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ మేయర్గా యర్రంశెట్టి రాజేష్
Guntur Mayor : గుంటూరు నగరపాలక సంస్థలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మేయర్గా కోవెలముడి లక్ష్మి అపర్ణ బాధ్యతలు స్వీకరించారు.
guntur mayor kovelamudi lakshmi aparna
Guntur Mayor : గుంటూరు నగరపాలక సంస్థలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మేయర్గా కోవెలముడి లక్ష్మి అపర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నగరంలోని 76 మంది కార్పొరేటర్లతోనూ కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
Also Read : AP Rains : ఏపీవైపు దూసుకొస్తున్న మరో రెండు తుపాన్లు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు
గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా 64వ వార్డు కార్పొరేటర్ యర్రంశెట్టి రాజేష్ ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని 24వ వార్డు కార్పొరేటర్ నిమ్మల వెంకట రమణ ప్రతిపాదించగా.. 45వ వార్డు కార్పొరేటర్ ముత్తినేని రాజేష్ బలపరిచారు. డిప్యూటీ మేయర్ పదవికి మరెవరూ పోటీ చేయకపోవడంతో యర్రంశెట్టి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ ప్రకటించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన మేయర్, డిప్యూటీ మేయర్ బాధ్యతలు చేపట్టడంతో గుంటూరు నగరంలో పాలనాపరమైన కార్యకలాపాలు కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి.
