YS Sharmila : షర్మిల రాకతో బెంగళూరులో హైటెన్షన్.. ఎయిర్పోర్ట్ వద్దే పోలీసుల మోహరింపు!
YS Sharmila : బెంగళూరు చేరుకున్న వైఎస్ షర్మిలకు యలహంక ప్యాలెస్ వివాదం నేపథ్యంలో కొత్త చిక్కులు ఎదురయ్యాయి. కోర్టు ఆదేశాలతో ప్యాలెస్ వద్ద పోలీసులు మోహరించారు. అసలు వివాదం ఏంటి? పూర్తి వివరాలివే..
YS Sharmila
- బెంగళూరులో షర్మిలకు షాక్..
- యలహంక ప్యాలెస్ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్..
- షర్మిలను అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు
YS Sharmila : బెంగళూరులో యలహంక ప్యాలెస్ వివాదం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరు చేరుకోవడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆమె ప్యాలెస్‌లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
అసలు ఏంటీ వివాదం? :
యలహంక ప్యాలెస్ విషయంలో ఇప్పటికే కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్యాలెస్‌లోకి షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తులు ప్రవేశించకూడదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు అక్కడికి వెళ్లవద్దన్న ఆదేశాలను అమలు చేసేందుకు పోలీసులు భారీగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది..
మరోవైపు, ప్యాలెస్ తమ సంస్థకు లీజుకు ఇచ్చిన ఆస్తి అని జగన్ తరఫున పిటిషన్ దాఖలు చేసిన సంస్థ ప్రతినిధి భీమిశెట్టి రమేష్‌బాబు వాదించారు. 2007లో భారతి తల్లి సుగుణమ్మ తమ సంస్థకు 20 ఏళ్ల పాటు ప్యాలెస్‌ను లీజుకు ఇచ్చారని తెలిపారు. అక్కడి పండ్ల తోటలు, మొక్కలు, గెస్ట్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాల అభివృద్ధికి భారీగా ఖర్చు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Read Also : Nara Lokesh : ఐఐటీ అయినా.. ఐటీఐ అయినా గౌరవం ఒక్కటే.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
అయితే, 2026 ఆగస్టు 27న సుగుణమ్మ ఈ ఆస్తిని తన కుమార్తె భారతి, మనుమరాళ్లకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్యాలెస్‌లో అలంకరణ పనుల పేరుతో బయటి వ్యక్తుల రాకపోకలు పెరిగితే ఆస్తికి నష్టం జరిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
విచారణ డిసెంబర్ 19కి వాయిదా :
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తులు ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేశారు.
ఇప్పుడు షర్మిల బెంగళూరు చేరుకోవడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. యలహంక ప్యాలెస్ వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..
