India vs Pakistan : పాక్ బౌలర్లను హడలెత్తించిన భారత యువ క్రికెటర్.. ఒంటరి పోరాటంతో సెంచరీ..
India vs Pakistan : మ్యాచ్ ప్రారంభం నుంచి భారత బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. కానీ, భారత యువ ప్లేయర్, జలంధర్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అర్జున్ రాజ్‌పూత్ మాత్రం పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Arjun Rajput
India vs Pakistan : ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా ఇవాళ పాకిస్థాన్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 46.3 ఓవర్లలో 208 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. మ్యాచ్ ప్రారంభం నుంచి భారత బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. కానీ, భారత యువ ప్లేయర్, జలంధర్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అర్జున్ రాజ్‌పూత్ మాత్రం పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Also Read : Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో న్యూజిలాండ్ పై ఒకే ఒక్కడు..
భారత బ్యాటర్లలో కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందానీ(0) తొలి ఓవర్లోనే ఔట్ కాగా.. అనంతరం వీకే వినీత్(8), యశ్వర్ధన్ చౌహాన్ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత ఆర్యవీర్ సెహ్వాగ్ కొద్దిసేపు దూకుడుగా ఆడినప్పటికీ 42 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన అర్జున్ రాజ్‌పుత్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత మరింత వేగంగా పరుగులు రాబట్టడంతో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 85 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతొ 107 పరుగులు చేసి జట్టును సురక్షితమైన స్థానంలో నిలిపాడు. మిగిలిన బ్యాటర్ల నుంచి రాజ్‌పూత్‌కు సహకారం అందలేదు.
స్టార్ బ్యాటర్లు ఆర్యవీర్ సెహ్వాగ్ (22), ఆన్వయ్ ద్రవిడ్ (10) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. వీకే వినీత్ 8, యశ్వర్దన్ చౌహాన్ 1, మనల్ చౌహాన్ 11, యశ్వీర్ గౌడ్ 4, మోహిత్ ఉల్వ 7 పరుగులకు ఔటయ్యారు. ఆఖర్లో కావ్య పటేల్ (23) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ 200 పరుగుల మార్కు దాటింది. పాక్ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్ షఫీక్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ సయ్యమ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
𝗛.𝗨.𝗡.𝗗.𝗥.𝗘.𝗗 💯
A clutch knock from Arjun Rajput, bringing up his century off 8️⃣0️⃣ deliveries 👏
Updates ▶️ https://t.co/WullKDGgH4
#MensU19AsiaCup https://t.co/bbCrgOxrZE
— BCCI (@BCCI) November 8, 2026
