Gold Price Today : బంగారం ప్రియులకు బిగ్ అలర్ట్.. గోల్డ్ రేటులో భారీ మార్పులు.. తులం ఎంతంటే?
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. గోల్డ్ రేటులో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Gold Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ న్యూస్. గోల్డ్ రేటులో రోజురోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు పెరిగిన గోల్డ్ రేటు మళ్లీ తగ్గింది.

ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ 80 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 3,644 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో (మేకింగ్ ఛార్జి, జీఎస్టీ కాకుండా) 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,27,860 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,17,200 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,28,010 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,17,340 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,27,860కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,17,210 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,70,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,70,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.1,70,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
