IND vs NZ : రెండో టెస్టులో టీమ్ఇండియాకు భారీ ఎదురుదెబ్బ.. తొలి ఇన్నింగ్స్ హీరోకు గాయం.. మైదానం నుంచి ఔట్..
IND vs NZ : క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Big Shock to Team India Prasidh Krishna replaces Akash Deep as concussion sub
IND vs NZ : క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టిన భారత పేసర్ ఆకాశ్ దీప్ గాయపడ్డాడు. మూడో రోజు తొలి సెషన్లో అతడు బ్యాటింగ్ చేస్తుండగా పలు మార్లు (రెండు సార్లు) బంతి అతడి హెల్మెట్‌ను తాకింది.
ఫిజియో పర్యవేక్షణ అనంతరం అతడు బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే.. ఔట్ అయిన తరువాత వైద్య పరీక్షల కోసం అతడు మిగిలిన మ్యాచ్‌కు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్నారు.
IND vs NZ : ధ్రువ్ జురెల్ అద్భుత బ్యాటింగ్.. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగుల వద్ద భారత్ ఆలౌట్
ఈ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ 52 బంతులు ఎదుర్కొన్నాడు. 4 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేవాడు. ముఖ్యంగా ధ్రువ్ జురెల్‌తో కలిసి అతడు ఎనిమిదో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ దూరం కావడం భారత్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
𝗨𝗽𝗱𝗮𝘁𝗲
Akash Deep got hit on his helmet while batting on Day 3 of the second Test against New Zealand in Christchurch. Prasidh Krishna has replaced him as a concussion substitute.
The BCCI Medical Team is monitoring him.
#TeamIndia | #NZvIND
— BCCI (@BCCI) November 29, 2026
