Garividi Lakshmi : సూపర్ హిట్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఎప్పుడు? ఎక్కడ?
క్టోబర్ 17న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.(Garividi Lakshmi)
Garividi Lakshmi
Garividi Lakshmi : ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఆనంది టైటిల్ రోల్ లో తెరకెక్కిన సినిమా గరివిడి లక్ష్మి. అక్టోబర్ 17న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. రాగ్ మయూర్, నరేష్, రాశి, ఎల్బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్ కొయ్య, శరణ్య ప్రదీప్, షకలక శంకర్, కంచరపాలెం కిషోర్, నితిన్ ప్రసన్న, వైవా రాఘవ.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్స్ లో బుర్రకథలు, ఫోక్స్ సాంగ్స్ తో, ఆనంది, రాజ్ మయూరి నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.
Also Read : Aadarsha Kutumbam : ఓటీటీలోకి ‘ఆదర్శ కుటుంబం’.. ఎప్పుడు? ఎక్కడ? ఎడిటింగ్ లో తీసేసిన బోల్డ్ సాంగ్ ఉంటుందా?
గరివిడి లక్ష్మి సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబర్ 26 అంటే రేపు గురువారం నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో మిస్ అయినవాళ్లు ఈ సినిమాని ఓటీటీలో చూసేయండి..
