Gold Silver Prices Today : మరోసారి భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. కారణాలివే.. ఏపీ, తెలంగాణలో తులం బంగారం ఎంతంటే?
Gold Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి.

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్‌న్యూస్. సోమ, మంగళవారాల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు ఇవాళ (బుధవారం) భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ తగ్గినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ తగ్గుదల వారం మొత్తం కొనసాగుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 3,220 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,950 తగ్గుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై ఆరు డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,551 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది. దీంతో గడిచిన పది రోజుల్లో కిలో వెండిపై రూ.30వేలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,24,580 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,14,200 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,24,730 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,14,340 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,24,580కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,14,200 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,65,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.1,65,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
