AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు జారీ..
AP Rain Alert : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Andhra pradesh weather update
AP Rain Alert : ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. వరుస తుపానులతో రాష్ఠ్రంలోని పలు ప్రాంతాల్లో గత, ఈ నెల ప్రాంభంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా రైతులు సాగుచేసిన పంటలతో పాటు.. పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే వర్షాల సృష్టించిన నష్టాల నుంచి కోలుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
Also Read : Cm Chandrababu Naidu: ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రేషన్లో తక్కువధరకే కందిపప్పు, నూనె
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు (గురువారం, శుక్రవారం) పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో గురువారం పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా .. శుక్రవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
