Russia Earthquake : ఒక్కసారిగా కంపించిన రష్యా.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం

Russia Earthquake : రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యెలిజోవోకు 62 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప లోతు, ప్రభావం, వివరాలివే..

Russia Earthquakes

  • రష్యాను వణికించిన భూకంపం..
  • 205 కిలోమీటర్ల లోతులో కేంద్రం
  • కమ్చట్కా ప్రాంతంలో భూమి ప్రకంపనలు..

Russia Earthquake : రష్యాలో మరోసారి భూమి కంపించింది. కమ్చట్కా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రత నమోదవడంతో స్థానికంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అందలేదు..

భూకంప కేంద్రం ఎక్కడంటే? :
కమ్చట్కా ద్వీపకల్పంలోని యెలిజోవో ప్రాంతానికి ఉత్తర వాయువ్యంగా సుమారు 62 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమి లోపల దాదాపు 205 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ప్రారంభమైనట్లు భారత భూకంప పర్యవేక్షణ సంస్థ అంచనా వేసింది. మరోవైపు అమెరికాకు చెందిన యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) మాత్రం భూకంప కేంద్రం లోతు 188 కిలోమీటర్లుగా పేర్కొంది.

Read Also : Buying Gold Without Bill : బంగారం రేటు తగ్గిందని.. బిల్లు లేకుండా బ్లాక్ మనీతో గోల్డ్ కొంటున్నారా? మీ పని గోవిందా?

లోతు ఎక్కువ.. ప్రభావం తక్కువేనా? :
సాధారణంగా భూకంపం తీవ్రతతో పాటు కేంద్రం భూమి లోపల ఎంత లోతులో ఉందనేది కూడా చాలా ముఖ్యం.. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉన్నప్పుడు భూమి ఉపరితలానికి చేరుకునే ప్రకంపనల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.. ఈసారి కూడా భూకంపం లోతు ఎక్కువగా ఉండటంతో ఉపరితలంపై ప్రభావం తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు..

అయితే, 6.7 తీవ్రత అంటే చిన్న విషయం కాదు.. అందుకే సంబంధిత అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నష్టం వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో చెప్పడం కష్టం.

ముఖ్యంగా భూకంపాలు సంభవించినప్పుడు ముందస్తు జాగ్రత్తలు, అధికారుల సూచనలు పాటించడం ఎంతో అవసరం. ప్రస్తుతం కమ్చట్కా ప్రాంతంలో పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..