Traveling Abroad : ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? డబ్బు ఆదా చేయాలంటే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి!
Traveling Abroad : విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ఈ 4 ఫారెక్స్ మనీ రూల్స్ తెలుసుకోండి. కరెన్సీ ఎక్స్చేంజ్, కార్డు పేమెంట్లు, ఏటీఎం ఛార్జీలు, మిగిలిన విదేశీ కరెన్సీ విషయంలో జాగ్రత్తలు పాటించి వేల రూపాయలు ఆదా చేసుకోండి.. అది ఎలాగంటే?
Traveling Abroad
- ఫారిన్ టూర్లో అనవసర ఖర్చులకు చెక్..
- ఈ ఫారెక్స్ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలంటే
- విదేశాల్లో రూపాయి విలువ తగ్గకుండా చూసుకోండి..
- ఈ 4 డబ్బు సూత్రాలు పాటించండి
Traveling Abroad : విదేశీ పర్యటనకు వెళ్తున్నారా? విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్, షాపింగ్, ఫుడ్.. ఇలా ప్రతి ఖర్చుకు ముందే లెక్కలు వేసుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయం అసలు మర్చిపోవద్దు. అదే ఫారెక్స్ (విదేశీ కరెన్సీ).
ప్రయాణంలో డబ్బు మార్చుకోవడం, కార్డు ద్వారా పేమెంట్లు చేయడం, ఏటీఎంల నుంచి క్యాష్ తీసుకోవడం వంటి విషయాల్లో చేసే చిన్న చిన్న తప్పులు మీ జేబుకు పెద్ద చిల్లు పెట్టొచ్చు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే వేల రూపాయలు అదనంగా ఖర్చవుతాయి. అందుకే, విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ఈ 4 మనీ రూల్స్ తప్పకుండా తెలుసుకోండి. అవేంటో ఓసారి లుక్కేయండి..
1. పదే పదే కరెన్సీ మార్చొద్దు :
విదేశాలకు వెళ్లే ముందు డబ్బును ఒక కరెన్సీ నుంచి మరో కరెన్సీకి మార్చుకోవడం చాలా కామన్.. అయితే, అవసరం లేకుండా పదేపదే ఎక్స్చేంజ్ చేయడం వల్ల నష్టపోవాల్సి వస్తుంది. ప్రతిసారీ ఎక్స్ఛేంజ్ ఛార్జీలు, మారకపు రేట్ల తేడా రూపంలో డబ్బు కోల్పోతారు. మీరు వెళ్లే దేశానికి సంబంధించిన కరెన్సీని నేరుగా కొనుగోలు చేయడం బెటర్..
2. కార్డు పేమెంట్లలో ఈ తప్పు చేయొద్దు :
విదేశాల్లో షాపింగ్ లేదా హోటల్ బిల్లు పేమెంట్ చేసేటప్పుడు కార్డు మెషీన్లో INR లేదా స్థానిక కరెన్సీ ఆప్షన్లు కనిపిస్తాయి. చాలామంది రూపాయల్లో చెల్లించడానికే ఇష్టపడతారు. కానీ, తద్వారా డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీలు పడే అవకాశం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు స్థానిక కరెన్సీలోనే పేమెంట్ చేయండి. అయితే, మీ కార్డు ఫారెక్స్ ఛార్జీలను ముందుగానే తెలుసుకోండి..
3. ఏటీఎంలో చిన్న మొత్తాలు పదేపదే తీయొద్దు :
విదేశాల్లో క్యాష్ అవసరమైనప్పుడు ప్రతిసారీ ఏటీఎంకు వెళ్లడం మంచిది కాదు. ఒక్కో విత్‌డ్రాయల్‌కు ఏటీఎం ఛార్జీలు, బ్యాంకు ఫీజులు పడవచ్చు. అవసరమైన క్యాష్ ముందుగానే ప్లాన్ చేసుకోండి. విత్‌డ్రా చేసే ముందు స్క్రీన్‌పై కనిపించే ఛార్జీలను చెక్ చేయండి..
4. మిగిలిన విదేశీ కరెన్సీని నిర్లక్ష్యం చేయొద్దు :
ట్రిప్ ముగిశాక మిగిలిన విదేశీ కరెన్సీని తిరిగి రూపాయల్లోకి మార్చుకోవడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అందుకే ప్రయాణానికి అవసరమైనంత మొత్తాన్నే మార్చుకోండి. ఫారెక్స్ కార్డు వాడేవారు మిగిలిన బ్యాలెన్స్‌ను వెనక్కి తీసుకునే నిబంధనలు, ఛార్జీలను ముందుగానే తెలుసుకోవాలి.
విదేశీ ప్రయాణంలో ఆదా చేయాలంటే షాపింగ్ తగ్గించడమే కాదు.. డబ్బు ఎక్స్ఛేంజ్ విషయంలోనూ తెలివిగా వ్యవహరించాలి. ముందస్తు ప్లానింగ్‌తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టొచ్చు..
