Gold Price Today : బంగారం ధరల్లో బిగ్ ఛేంజ్.. ఊహించని మార్పు.. ఎందుకిలా జరుగుతుంది..? తులం రేటు ఎంతంటే..
Gold Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్.. ఇవాళ బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి వాటి ధరలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగతోంది. బుధవారం భారీగా తగ్గిన ధర.. ఇవాళ పెరిగింది.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 2610 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2400కుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 10డాలర్లకుపైగా పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,590 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో (మేకింగ్ ఛార్జి, జీఎస్టీ కాకుండా) 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,25,890 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,15,400 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,26,040 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,15,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,25,890కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,15,400 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,65,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.1,65,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
