Vivo X500 Series : కొంటే వివో ఫోన్ కొనాలి.. ఐఫోన్‌కు పోటీగా వివో X500 సిరీస్ ఆగయా.. ధర, ఫీచర్లు తెలిస్తే షాకే..!
Vivo X500 Series : భారత్‌లో వివో ఎక్స్500, వివో ఎక్స్500 ప్రో, వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. రూ.1.19 లక్షల నుంచి ప్రారంభమయ్యే ధరలు, 200MP కెమెరా, 7800mAh బ్యాటరీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Vivo X500 Series Launch
- లగ్జరీ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..
- భారత్‌లో Vivo X500 సిరీస్ లాంచ్
- 200MP కెమెరా, 7800mAh బ్యాటరీ..
Vivo X500 Series : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో రేంజే వేరబ్బా.. భారత మార్కెట్లో వివో X500 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో వివో X500, వివో X500 ప్రో, వివో X500 ప్రో మ్యాక్స్ మోడళ్లను తీసుకొచ్చింది. ఆకట్టుకునే డిజైన్‌తో పాటు అదిరిపోయే కెమెరాలు, భారీ బ్యాటరీలు, పవర్ ఫుల్ ప్రాసెసర్లను ఈ ఫోన్లలో అందించింది. ఈ వివో ఫోన్ల ధరలు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వివో X500 సిరీస్ ధరలివే :
వివో X500 బేస్ వేరియంట్ (12GB ర్యామ్, 256GB స్టోరేజ్) ధరను రూ.1,19,999గా నిర్ణయించింది. వివో X500 ప్రో ధర రూ.1,49,999గా ఉంది. ఇక టాప్ మోడల్ వివో X500 ప్రో మ్యాక్స్ 12GB+256GB వేరియంట్ ధర రూ.1,64,999 కాగా, 12GB+512GB మోడల్ ధర రూ.1,79,999గా ఉంది.
అంతేకాదు, ఫొటోగ్రఫీ ఇష్టపడేవారి కోసం ప్రత్యేక లెన్స్‌లను కూడా అందిస్తోంది. 200mm టెలిఫోటో లెన్స్ ధర రూ.15,999, 400mm లెన్స్ ధర రూ.27,999గా నిర్ణయించింది. ఈ ఫోన్లు డిసెంబర్ 3 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఆన్లైన్ స్టోర్‌లో విక్రయానికి రానున్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో 10 శాతం ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు.
కెమెరా, బ్యాటరీలో అదుర్స్ :
ఈ మూడు ఫోన్లు ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 7పై రన్ అవుతాయి. వివో ఎక్స్500లో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే, వివో X500 ప్రోలో 6.36 అంగుళాల 1.5K స్క్రీన్ ఉన్నాయి. వివో X500 ప్రో మ్యాక్స్‌లో 6.85 అంగుళాల 2K అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. మూడింటిలోనూ 144Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది.
ప్రాసెసర్ల విషయానికి వస్తే.. :
వివో X500లో డైమన్షిటీ 9600M చిప్సెట్ ఉండగా, ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలో డైమన్షిటీ 9600 ప్రో ప్రాసెసర్ అందించారు. కెమెరాలే ఈ సిరీస్‌లో మెయిన్ అట్రాక్షన్ అనమాట.. వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్‌లో 50MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 200MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. వివో X500 ప్రోలో 64MP టెలిఫోటో కెమెరా అందించారు. వివో X500లోనూ 50MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 64MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.
The anticipation was extraordinary. The experience is even more so. The #vivoX500Series is finally here.
Explore the lineup. Book yours today.
#vivoindia #BornToCreate https://t.co/Y4fSfRCrQN
— vivo India (@Vivo_India) November 26, 2026
బ్యాటరీ విషయానికి వస్తే..
వివో ఎక్స్500లో 7,500mAh, ప్రోలో 6,510mAh, ప్రో మ్యాక్స్‌లో ఏకంగా 7,800mAh బ్యాటరీ అమర్చారు. ఈ 3 వివో ఫోన్లకు IP68, IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా ప్రీమియం ఫోన్ కొనాలనుకునేవారికి వివో కొత్త సిరీస్ అద్భుతమైన ఆప్షన్..
