CIBIL Score : 750కి పైగా క్రెడిట్ స్కోర్ కావాలంటే.. ఈ 5 అలవాట్లు ఇప్పుడే మార్చుకోండి..!
CIBIL Score : క్రెడిట్ స్కోర్ 750కి పెంచుకోవాలనుకుంటున్నారా? ఈఎంఐలు సకాలంలో చెల్లించడం నుంచి క్రెడిట్ కార్డు వినియోగం వరకు ఈ 5 ముఖ్యమైన అలవాట్లతో మీ సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..
CIBIL Score Above 750
- మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా?
- ఈరోజు నుంచే ఈ పనులు చేయండి
- క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం కష్టమేమీ కాదు
CIBIL Score : ఈ రోజుల్లో బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డు పొందాలన్నా క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. ముఖ్యంగా 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే రుణాలు పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
కానీ, చాలామందికి తమ క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుందో దాన్ని ఎలా పెంచుకోవాలో తెలియదు. అయితే, కొన్ని చిన్న చిన్న ఆర్థిక అలవాట్లను మార్చుకుంటే క్రెడిట్ హిస్టరీని మరింత పెంచుకోవచ్చు. మరి ఆ 5 అలవాట్లు ఏంటో ఓసారి చూద్దాం..
1. బిల్లులు, ఈఎంఐలు టైమ్‌కు కట్టండి :
క్రెడిట్ స్కోర్ తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఆలస్యపు చెల్లింపులు ఒకటి. క్రెడిట్ కార్డు బిల్లు అయినా, లోన్ ఈఎంఐ అయినా గడువు తేదీలోపే చెల్లించాలి. మర్చిపోకుండా ఉండేందుకు ఆటో పేమెంట్ సదుపాయాన్ని వాడుకోవచ్చు..
2. క్రెడిట్ కార్డు లిమిట్ పూర్తిగా వాడొద్దు :
మీ కార్డు లిమిట్ రూ.లక్ష ఉంటే.. సాధ్యమైనంత వరకు రూ.30 వేల లోపే వినియోగించండి. అంటే.. క్రెడిట్ లిమిట్లో 30 శాతం కన్నా తక్కువ వాడటం మంచిది. దీనివల్ల మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి అదుపులో ఉంటుంది.
3. అవసరం లేకుండా లోన్లకు అప్లయ్ చేయొద్దు :
ఒకేసారి చాలా బ్యాంకుల్లో లోన్ కోసం అప్లయ్ చేయడం మంచిది కాదు. ప్రతి దరఖాస్తుతో హార్డ్ ఎంక్వైరీ నమోదయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఎంక్వైరీలు మీ స్కోర్‌పై ప్రభావం చూపవచ్చు.
4. రుణాల విషయంలో బ్యాలెన్స్ ఉండాలి :
సెక్యూర్డ్ లోన్లు, అన్సెక్యూర్డ్ లోన్లకు సంబంధించిన క్రెడిట్ హిస్టరీ కూడా మీ ప్రొఫైల్‌లో భాగమే. అయితే, స్కోర్ పెంచుకోవాలనే ఉద్దేశంతో అవసరం లేని కొత్త అప్పులు చేయకండి..
5. క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకోండి :
మీ క్రెడిట్ రిపోర్టులో తప్పులు ఉన్నాయేమో ఎప్పటికప్పుడు పరిశీలించండి. మీరు తీసుకోని లోన్ కనిపించినా, చెల్లించిన బకాయి ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు చూపించినా వెంటనే సిబిల్ సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయండి..
క్రెడిట్ స్కోర్ ఒక్కరోజులో పెరగదు. క్రమశిక్షణతో పేమెంట్లు చేయడం, అప్పులను అదుపులో ఉంచుకోవడం వంటి అలవాట్లతో కాలక్రమేణా స్కోరు పెరుగుతుంది. 750 స్కోర్ లక్ష్యంగా పెట్టుకుంటే ఈ 5 అలవాట్లను పాటించడం చాలా మంచిది.
