AP DSC 2026 Notification : ఏపీలో టీచర్ ఉద్యోగాల జాతర.. 2,111 పోస్టులు.. ఇలా అప్లయ్ చేసుకోండి..!
AP DSC 2026 Notification : ఏపీ డీఎస్సీ 2026 ద్వారా 2,111 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, చివరి తేదీ వివరాలివే..
AP Teacher Recruitment 2026
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- ఏపీలో 2,111 టీచర్ ఉద్యోగాలు..
- ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పూర్తి వివరాలివే
- ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది
AP DSC 2026 Notification : ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ చేస్తున్న అభ్యర్థులకు ఏపీ డీఎస్సీ 2026 మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,111 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో టీచర్ ఉద్యోగాల కోసం రెడీ అవుతున్న అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
రెండు విభాగాల్లో ఉద్యోగాలు :
ఈ నియామకాల్లో ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ విభాగంలో 1,205 ఖాళీలు ఉండగా, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 906 పోస్టులను భర్తీ చేయనున్నారు. అంటే.. రెండు విభాగాల్లో కలిపి 2,111 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
యాజమాన్యాల వారీగా చూస్తే.. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 1,709 పోస్టులు ఉన్నాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో మరో 402 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు ఏంటంటే? :
ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా పీజీ విద్యార్హతలతో పాటు సంబంధిత టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఈ కోర్సులు ఎన్సీటీఈ లేదా ఆర్సీఐ గుర్తింపు పొందినవై ఉండాలి. అలాగే, ఏపీ టెట్ పేపర్-1, పేపర్-2 లేదా సీటెట్‌లో అర్హత సాధించి ఉండటం తప్పనిసరి..
వయసు విషయానికి వస్తే.. 2026 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 44 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (tet2dsc.apcfss.in) ద్వారా ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు డిసెంబర్ 20 నుంచి నిర్వహించనున్నారు.
టీచర్ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా, అర్హతలు పరిశీలించుకుని ముందుగానే అప్లయ్ చేసుకోవడం మంచిది. పూర్తి నోటిఫికేషన్, పోస్టుల వివరాలు, ఇతర నిబంధనలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోండి..
