iQOO 16R Launch : ఐక్యూ 16R వచ్చేస్తోంది.. 6,680 మల్టీకోర్ స్కోర్‌తో అదరగొట్టిన కొత్త స్మార్ట్‌ఫోన్!
iQOO 16R Launch : ఐక్యూ 16ఆర్ త్వరలో లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 12GB ర్యామ్, అడ్రినో 825 జీపీయూ, ఆండ్రాయిడ్ 17, గీక్‌బెంచ్ స్కోర్లు సహా ఈ ఫోన్ పూర్తి వివరాలివే..
iQOO 16R Launch
- గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్..
- స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4తో ఐక్యూ 16R వస్తోంది
- ఐక్యూ 16R స్పెసిఫికేషన్లు లీక్..
- 12GB ర్యామ్, అడ్రినో 825 జీపీయూ
iQOO 16R Launch : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త ఫోన్ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా మంచి పెర్ఫార్మెన్స్, గేమింగ్ ఫీచర్లు కోరుకునేవారికి ఇదే బెస్ట్ ఫోన్.. ఐక్యూ 16ఆర్ ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ తాజాగా గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్లో కనిపించింది. దీంతో లాంచ్‌కు ముందే కీలక స్పెసిఫికేషన్లపై ఓ క్లారిటీ వచ్చింది..
లేటెస్ట్ లిస్టింగ్ ప్రకారం.. :
ఐక్యూ 16ఆర్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇందులో ఆక్టా-కోర్ చిప్సెట్తో పాటు గ్రాఫిక్స్ కోసం అడ్రినో 825 జీపీయూ అందించనున్నారు. అంటే.. రోజువారీ టాస్కులతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్ విషయంలోనూ ఈ ఫోన్ మంచి ఎక్స్పీరియన్స్ అందించనుంది.
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ గీక్‌బెంచ్ లిస్టింగ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఇందులో ఈ ఫోన్ 12GB ర్యామ్‌తో కనిపించింది. అయితే, కంపెనీ లాంచ్ సమయంలో మరిన్ని ర్యామ్ వేరియంట్లను తీసుకురానుంది.
Read Also : YS Sharmila : షర్మిల రాకతో బెంగళూరులో హైటెన్షన్.. ఎయిర్పోర్ట్ వద్దే పోలీసుల మోహరింపు!
స్టోరేజ్ విషయానికి వస్తే.. :
128జీబీ నుంచి 512GB వరకు ఆప్షన్లు ఉండవచ్చని అంచనా.. ఇక పెర్ఫార్మెన్స్ స్కోర్ల విషయానికొస్తే.. గీక్‌బెంచ్ సింగిల్-కోర్ టెస్టులో 1,775 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 6,680 పాయింట్లు సాధించింది. అంతేకాదు, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కనిపించింది..
ఇదిలా ఉంటే.. ఐక్యూ 16ఆర్కు ముందున్న ఐక్యూ 15ఆర్ కూడా ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. అందులో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 7,600mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. 50MP ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి.
ఐక్యూ 16ఆర్ స్పెసిఫికేషన్లు చూస్తుంటే.. మంచి పెర్ఫార్మెన్స్ ఫోన్ కోసం ఎదురుచూసే వారికి ఆసక్తికరమైన ఆప్షన్ కనిపిస్తోంది. అయితే, ధర, పూర్తి ఫీచర్లు, లాంచ్ తేదీపై కంపెనీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..
