Ys Jagan-AP High Court : వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో ఊరట దక్కేనా? పులివెందుల కేసుపై క్వాష్ పిటిషన్..!
Ys Jagan Pulivendula Case : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీల పిటిషన్లపైనా నేడు విచారణ జరగనుంది..
Ys Jagan Mohan Reddy Moves Ap High Court To Quash Pulivendula Case
- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్
- పులివెందుల కేసుపై క్వాష్ పిటిషన్
- జగన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
Ys Jagan-AP High Court : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌తో పాటు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు వేసిన పిటిషన్లు కూడా నేడు విచారణకు రానున్నాయి. దీంతో హైకోర్టు (Ys Jagan) విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది..
పులివెందుల కేసు ఏంటంటే?
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారనే కారణంతో పులివెందులలో ఆయనపై కేసు నమోదైంది. అయితే, ఈ కేసును సవాల్ చేస్తూ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
Read Also – EPS Pension Hike : పెన్షనర్లకు భారీ ఊరట.. ఇకపై నెలకు రూ.1,000 కాదు.. రూ.3 వేల పింఛను?
ఎమ్మెల్సీల పిటిషన్లపైనా విచారణ :
మరోవైపు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు కూడా తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఎస్ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఘటనకు సంబంధించి వారిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనూ ఉపశమనం కోరుతూ ఎమ్మెల్సీలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
