Palla Srinivasa Rao : ఇంట్లో వాళ్లకే న్యాయం చేయలేనోడు.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు? జగన్‌పై పల్లా ఫైర్!

Palla Srinivasa Rao : తల్లి, చెల్లితో కుటుంబ వివాదంపై వైసీపీ అధినేత జగన్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టార్గెట్ చేశారు. కుటుంబానికే న్యాయం చేయలేని నాయకుడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు..

Palla Srinivasa Rao

  • తల్లి, చెల్లికే న్యాయం చేయలేదు..
  • కుటుంబ సమస్యలు పరిష్కరించుకోలేక టీడీపీపై బురదా?
  • సొంత కుటుంబానికే న్యాయం చేయలేని నాయకుడు..

Palla Srinivasa Rao : రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ ముదిరింది. కుటుంబ వ్యవహారాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సొంత ఇంట్లోనే సమస్యలను పరిష్కరించుకోలేని నాయకుడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు..

టీడీపీపై ఆరోపణలు విడ్డూరం :
తల్లి, చెల్లితో నెలకొన్న కుటుంబ వివాదాన్ని ప్రస్తావిస్తూ జగన్‌పై పల్లా తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది పోయి, వాటిని రాజకీయాలకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తన కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకోలేక తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

మహిళల గౌరవం, హక్కుల గురించి బహిరంగ సభల్లో మాట్లాడే జగన్.. తన కుటుంబంలో మహిళల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పల్లా ఆరోపించారు. తల్లి, చెల్లి సమస్యలను పరిష్కరించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

Read Also : NVIDIA Jensen Huang : ఎన్వీడియా CEOగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ..

జగన్‌పై పల్లా విమర్శలు :
ఆస్తుల విషయంలో సొంత కుటుంబ సభ్యుల మధ్యే వివాదాలు తలెత్తడం, అవి బహిరంగ చర్చకు రావడం జగన్ వైఖరిని ప్రశ్నించేలా ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో సీసీ కెమెరాల్లో చూస్తూ ఆనందిస్తున్నారంటూ పల్లా విమర్శలు గుప్పించారు.

కుటుంబ వివాదం కాస్తా రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. మహిళా గౌరవం, కుటుంబ విలువలు, నాయకుల బాధ్యత వంటి అంశాలను తెరపైకి తెస్తూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వ్యక్తిగత వ్యవహారాలు రాజకీయ అస్త్రాలుగా మారుతున్న వేళ.. ఈ వివాదంపై జగన్ వైపు నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.