SSC Public Exams : తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షలకు షెడ్యూల్ రెడీ.. తేదీలు ఇవే..?
Telangana SSC Public Exams : తెలంగాణలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది.
- Harish Thanniru
- Published on- November 22, 2026 / 11:16 AM IST
Telangana SSC Public Exams
Telangana SSC Public Exams : తెలంగాణలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. వచ్చే ఏడాది మార్చి 18వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదికను పంపించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తరువాత అధికారికంగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Also Read : Nagarjuna Sagar Row : సాగర్‌లో ఏపీ ప్రాజెక్ట్ కలకలం.. కారు గేర్.. రేవంత్ సర్కార్‌లో ప్రకంపనలు! అసలు కథ ఇదే..
పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్ఈ తరహాలో ఎగ్జామ్స్ కు మధ్య వ్యవధిని గతేడాది పెంచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 10వ తేదీ వరకు ముగుస్తాయి. ప్రధాన పరీక్షల ప్రారంభం నుంచి ముగింపు వరకు 24 రోజుల సమయం ఉంటుంది.
పదో తరగతి పరీక్షలకు దాదాపు 5.25లక్షల నుంచి 5.50లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు నవంబర్ 26వ తేదీ వరకు సమయం ఉంది. ఆ తరువాత డిసెంబర్ 8వ తేదీ వరకు రూ. 50 ఆలస్య రుసుముతో.. డిసెంబర్ 21 వరకు రూ.200 ఆలస్య రుసుముతో.. 2027 జనవరి 4వ తేదీ వరకు రూ. 500 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు అవకాశం ఉంది.
మూడు సబ్జెక్టులకు మించి పరీక్ష రాసే విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసే విద్యార్థులకు రూ.110 ఫీజుగా నిర్ణయించారు. రెగ్యులర్ ఎస్ఎస్సీ విద్యార్థులకు నిర్ణయించిన ఫీజుతో పాటు ఒకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, 2027 పదో తరగతి పరీక్షల పూర్తి టైమ్‌టేబుల్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత పరీక్షల తేదీలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
