Indiramma Life Insurance Scheme : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ బీమా అందరికీ కాదు.. ఈ అర్హతలు ఉంటేనే ఛాన్స్..!

Indiramma Life Insurance Scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి కొత్త నిబంధనలేంటో తెలుసా? ఎన్ని ఏళ్ల వయసున్నవారికి అవకాశం ఉంటుంది? అర్హతలు, రిజిస్ట్రేషన్ విధానం, అవసరమైన డాక్యుమెంట్లు, లాస్ట్ డేట్ వివరాలివే..

Indiramma Life Insurance Scheme

  • తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్..
  • ఇందిరమ్మ బీమా కోసం కొత్త నిబంధనలు
  • మీ కుటుంబానికి రూ.లక్షల భరోసా కావాలా?
  • ఇందిరమ్మ బీమాకు ఇలా అప్లయ్ చేయండి

Indiramma Life Insurance Scheme : తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ బీమా పథకానికి సంబంధించి కీలక నిబంధనలేంటో తెలుసా?

ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే, ఈ బీమా పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

ఎవరెవరు అర్హులు? :
ఈ పథకంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్నవారు రిజిస్టర్ చేసుకోవచ్చు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ పెద్ద లేదా కుటుంబానికి ఆదాయం తీసుకొచ్చే వ్యక్తి పేరుతోనే బీమా రిజిస్టర్ చేయాలి. ఇప్పటికే ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న బీమా పథకాల పరిధిలో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు..

Read Also : Motorola Edge 70 Pro Plus : మోటోరోలా లవర్స్‌కు పండగే.. రూ.47,999 ఫోన్ ఇప్పుడు జస్ట్ రూ. 42,749కే.. ఇంకా తగ్గాలంటే?

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? :
అర్హులైన వారు సమీపంలోని రిజిస్టర్ కేంద్రానికి వెళ్లి తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవచ్చు. బీమా పొందాలనుకునే వ్యక్తి స్వయంగా హాజరై నామినీ వివరాలు ఇవ్వాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో వెరిఫికేషన్ తప్పనిసరి.

వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్‌లో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ముందుగా సరిచేయించుకోవాలి. అలాగే, రేషన్ కార్డుకు ఈ-కేవైసీ పూర్తి చేయని వారు ముందుగా ఆ ప్రాసెస్ పూర్తి చేయాలి.

ముఖ్యమైన తేదీలివే :
నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు కేంద్రానికి రాలేకపోతే సిబ్బంది ఇంటికే వెళ్లి వివరాలు రిజిస్టర్ చేస్తారు. నామినీగా ఇద్దరిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. వారికి అందాల్సిన వాటాను కూడా ముందుగానే తెలియజేయాలి..

కుటుంబానికి అండగా నిలిచే సంపాదనపరుడికి బీమా రక్షణ కల్పించాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అర్హతలు, ఆధార్, రేషన్ కార్డు వివరాలు సరిచూసుకోవడం బెటర్..