BRS Party : ఉత్తర తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్.. దీక్షా దివస్‌తో పొలిటికల్ మైలేజ్ వచ్చేనా.?
BRS Party : అలుగునూరు దగ్గర కేసీఆర్అరెస్టు నుంచి ఎన్నో మలుపులు తిరిగి..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి పుష్కర కాలం గడిచిపోయింది. ఈ నేపథ్యంలో విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తిరిగి పవర్లోకి వచ్చేందుకు.. కారు గేర్ మారుస్తోంది. సేమ్‌టైమ్ ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ..అలుగునూరు వేదికగా దీక్షా దివస్పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది.
BRS Party
BRS Party : ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం..ఇంకోవైపు కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం..ఈ మూడు లక్ష్యాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా దీక్షా దివస్‌కు గులాబీ పార్టీ భారీ స్కెచ్వేసిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2009 నవంబర్29..తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిన దినం.
Also Read : Annamayya Song : చర్చిలో అమెరికా గాయకుల నోట అన్నమయ్య కీర్తన.. చప్పట్లతో మార్మోగిన ప్రాంగణం.. వీడియో వైరల్
అలుగునూరు దగ్గర కేసీఆర్అరెస్టు నుంచి ఎన్నో మలుపులు తిరిగి..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి పుష్కర కాలం గడిచిపోయింది. ఈ నేపథ్యంలో విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తిరిగి పవర్లోకి వచ్చేందుకు.. కారు గేర్ మారుస్తోంది. సేమ్‌టైమ్ ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ..అలుగునూరు వేదికగా దీక్షా దివస్పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. అయితే ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకునే కార్యక్రమమేనా.? లేక గత వైభవాన్ని గుర్తు చేస్తూ వర్తమాన పాలిటిక్స్‌లోనూ పైచేయి సాధించే స్కెచ్చా.? అనేదే ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ హాజరవుతున్న సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.
అలుగునూరు వేదిక నుంచి మరోసారి రాజకీయా సెగను రాజేసే ప్లాన్ చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరును గుర్తు చేస్తూ..అసలు రాజకీయ లెక్కలకు తెరలేపుతుందన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను..నేటి తరం యువతకు..జెన్‌జీకి తెలిసేలా ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసే వ్యూహమని చెబుతున్నారు. నాడు తెలంగాణ కోసం చేసిన పోరాటం..ఆ తర్వాత బీఆర్ఎస్ పాలన..కాంగ్రెస్ పాలనలో ఎదురవుతున్న సమస్యలన్నింటిపై..అలుగునూరు దీక్షా దివస్ వేదిక నుంచి గళమెత్తేందుకు రెడీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు చిన్నవేమి కావు. ఓటమి తర్వాత క్యాడర్లో ఉత్సాహం నింపడం, ప్రజల్లో పార్టీపై పాజిటివ్ ఒపీనియన్ బిల్డ్ చేయడం, క్షేత్రస్థాయిలో తిరిగి బలపడటం..ఇలా గులాబీ పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమ సెంటిమెంట్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావడం రాజకీయంగా ఎంతవరకు కలిసొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. దీక్షా దివస్ ఒక్కరోజు కార్యక్రమానికే బీఆర్ఎస్పరిమితం కావడం లేదు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను యువతకు, జెన్-జీకి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో నవంబర్29 నుంచి డిసెంబర్9 వరకు కార్యక్రమాలకు పార్టీ మైనారిటీ విభాగం సిద్దమైంది. ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధనకు కేసీఆర్ శ్రమించిన తీరు, త్యాగాలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను యువతకు వివరించేలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. దీక్షా దివస్‌ను ఒక కార్యక్రమంగా కాకుండా..ఉద్యమ స్పూర్తిని రగిల్చే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు.
