Airtel Recharge Plans : డేటా వద్దు.. కాల్స్ చాలు.. ఎయిర్‌టెల్‌లో చౌకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. ధర జస్ట్..!

Airtel Recharge Plans : కేవలం కాల్స్, SMS మాత్రమే కోరుకునే కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ రూ. 185 ప్లాన్ అందిస్తోంది. అత్యంత చౌకైన కాలింగ్ ప్లాన్ ఎలా పొందాలంటే?

Airtel Recharge Plans

  • ఎయిర్‌టెల్‌లో రూ. 185కే అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్
  • ఎయిర్‌టెల్ చౌక రీఛార్జ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి
  • రూ. 203 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ

Airtel Recharge Plans : మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇంటర్నెట్ కన్నా ఫోన్ కాల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారికి ఖరీదైన రీఛార్జ్‌లు అవసరం లేదు..

ఇలాంటి కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని టెలికాం కంపెనీలు వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ లిస్టులో ఎయిర్‌టెల్ కూడా తక్కువ ధరలో 3 ప్లాన్లను అందిస్తోంది. రూ. 185 నుంచి ప్రారంభమయ్యే ఈ రీఛార్జ్‌లతో కాలింగ్, SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

రూ. 185 ప్లాన్ బెనిఫిట్స్ :
ఎయిర్‌టెల్ అందించే రూ.185 ప్లాన్ బడ్జెట్‌లో రీఛార్జ్ చేసేవారికి అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు 300 ఎస్ఎంఎస్ ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు, ఫ్రీ హలోట్యూన్స్ బెనిఫిట్ కూడా ఉంది. అయితే, ఇందులో మొబైల్ డేటా మాత్రం ఉండదు. ఫీచర్ ఫోన్ వాడేవారు, సెకండరీ సిమ్ ఉంచుకునేవారు ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు..

Read Also : iQOO 16R Launch : ఐక్యూ 16R వచ్చేస్తోంది.. 6,680 మల్టీకోర్ స్కోర్‌తో అదరగొట్టిన కొత్త స్మార్ట్‌ఫోన్!

రూ. 203 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ :
ఎయిర్‌టెల్ రూ. 203 ప్లాన్ మరో బడ్జెట్ ఆప్షన్. ఈ రీఛార్జ్‌తో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. నేషనల్ రోమింగ్‌తో కలిపి అన్ లిమిటెడ్ కాలింగ్, 300 ఫ్రీ ఎస్ఎంఎస్ అందుతాయి. దీనికి అదనంగా ఫ్రీ హలోట్యూన్స్ బెనిఫిట్ కూడా ఉంది.

రూ. 206 ప్లాన్ స్పెషాలిటీ ఏంటంటే? :
రూ. 206 ప్లాన్‌లో క్యాలెండర్ నెల వ్యాలిడిటీ మెయిన్ అట్రాక్షన్.. అంటే నెలను బట్టి 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అన్ లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ కాల్స్‌తో పాటు 300 ఎస్ఎంఎస్ ఫ్రీగా లభిస్తాయి. ఇందులోనూ డేటా బెనిఫిట్ ఉండదు..

మొత్తంగా చూస్తే.. ఇంటర్నెట్ కోసం వై-ఫై వాడుతూ ఫోన్ కాల్స్‌కు మాత్రమే మొబైల్ రీఛార్జ్ చేసుకునేవారికి ఈ ప్లాన్లు అద్భుతంగా ఉంటాయి. అయితే, రీఛార్జ్ చేసే ముందు మీ సర్కిల్‌లో అందుబాటులో ఉన్న ధరలు, బెనిఫిట్స్ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్..