IND vs NZ : 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన జైస్వాల్, కేఎల్ రాహుల్!
Jaiswal KL Rahul Partnership : కివీస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో 32ఏళ్ల తరువాత సరికొత్త చరిత్ర సృష్టించారు.
- Harish Thanniru
- Updated on- November 20, 2026 / 02:50 PM IST
Jaiswal KL Rahul Partnership
Jaiswal KL Rahul Partnership : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అదరగొట్టారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో భారత ఓపెనర్లు 32 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించారు.
Also Read : NZ vs IND : అదరగొట్టిన జైశ్వాల్, కేఎల్ రాహుల్.. కివీస్‌కు దీటుగా బదులిస్తున్న భారత్
కివీస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేశారు. యశస్వి జైస్వాల్ (85), కేఎల్ రాహుల్ (52 నాటౌట్) కలిసి తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు శుభారంభాన్ని అందించారు. 21వ శతాబ్దంలో న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో భారత ఓపెనర్లు సాధించిన తొలి సెంచరీ భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.
1994లో న్యూజిలాండ్‌లోని హామిల్టన్ వేదికగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ, నయన్ మోంగియా జోడీ తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు జైస్వాల్, రాహుల్ జోడీ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ కేవలం 89 బంతుల్లో 85 పరుగులు సాధించాడు. ఇందులో 16 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ దిశగా సాగుతున్న అతడిని మాట్ హెన్రీ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 130 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. 116 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి దేవదత్ పడిక్కల్ (16 నాటౌట్) సహకారం అందించాడు.
ఇదిలాఉంటే.. న్యూజిలాండ్ జట్టు రెండోరోజు ఆటను 243/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించింది. మరో 125 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్(118) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, 94వ ఓవర్లో 286 పరుగుల వద్ద ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో ఫిలిప్స్ బౌల్డయ్యాడు. హెన్రీ నికోల్స్ (175 నాటౌట్ : 335 బంతుల్లో 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 216 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో తొలి ఇన్నింగ్స్ లో జస్ర్పిత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు.
