Kartik Purnima 2026 : కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం ఇలా.. 365 వత్తుల దీపంతో ఈ సమస్యలు దూరం
Kartik Purnima 2026 : ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 24వ తేదీన (మంగళవారం) వచ్చింది. కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 23వ తేదీ (సోమవారం) రాత్రి ప్రారంభమై 24వ తేదీ మొత్తం ఉంటుంది.
Kartik Purnima 2026
Kartik Purnima 2026 : కార్తీక మాసం హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుల్లో పౌర్ణమి ఒకటి. ఈ ఒక్కరోజు దీపం వెలిగించడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
Also Read : Gold Loan : పసిడి ధర పతనం.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాకిస్తున్న బ్యాంకులు.. కట్టాల్సిందే..!
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 24వ తేదీన (మంగళవారం) వచ్చింది. కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 23వ తేదీ (సోమవారం) రాత్రి ప్రారంభమై 24వ తేదీ మొత్తం ఉంటుంది. భక్తులు కార్తీక స్నానాలు, కార్తీక పౌర్ణమి ఉపవాస దీక్షలు, 365 వత్తుల దీపారాధన, జ్వాలాతోరణం దర్శనం వంటి ముఖ్యమైన ఘట్టాలను మంగళవారమే జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. పవిత్ర నదుల్లో లేదంటే సరస్సుల దగ్గర కార్తీక స్నానం ఆచరించాలి. నదికి వెళ్లలేనివారు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయాలి. ఆ తరువాత దీపారాధన చేసి ఉపవాస సంకల్పం చెప్పుకోవాలి. శివలింగానికి పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు సమర్పించాలి. శ్రీ మహావిష్ణువుకు పూజలు చేస్తే తులసీ దళాలు సమర్పించాలి. ఆ తరువాత కార్తీక పురాణం పఠించాలి.
కార్తీక పౌర్ణిమ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఏడాదిలో ఉన్న రోజులకు ప్రతీకగా 365 ఒత్తుల దీపం వెలిగించాలి. ఆవునెయ్యిలో తడిపిన 365 ఒత్తుల దీపం వెలిగించండి. తులసి కోట వద్ద, ఉసిరి చెట్టు కింద దీపారాధాన చేయడం వల్ల సకల దోషాలు తొలగుతాయి. అదేవిధంగా కార్తీక పూర్ణిమ రోజు సాయంత్రం పూట శివాలయాల్లో నిర్వహించే జ్వాలాతోరణం దర్శించుకొని ఆ మంటల కింద నుంచి నడవటం వల్ల గ్రహ బాధలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
