January 12 Vidudala : అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. వదిన మరదళ్ల డివికి డివికి డిక్కుమ్..
మీరు కూడా ఈ వదిన మరదళ్ల డివికి డివికి డిక్కుమ్..సాంగ్ వినేయండి.. (January 12 Vidudala)
- Saketh U
- Published on- November 21, 2026 / 12:50 PM IST
January 12 Vidudala
January 12 Vidudala : విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘జనవరి 12 విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.
అనిల్ రావిపూడి పండగ సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి డివికి డివికి డిక్కుమ్.. అంటూ సాగే మొదటి పాటని విడుదల చేసారు. ఈ పాట వదిన మరదళ్ల మధ్య సాగుతుంది. కీర్తి సురేష్ -కృతిశెట్టి వదిన మరదలుగా డ్యాన్సులతో అదరగొట్టేసారు. ఈ పాటని GV ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వంలో అనంత్ శ్రీరామ్ రాయగా మధుప్రియ, హరిప్రియ పాడారు.
Also Read : Manmadhudu Pair : హల్దీ వేడుకల్లో సందడి చేసిన మన్మధుడు జంట.. నాగార్జున – అన్షు ఫోటోలు వైరల్..
మీరు కూడా ఈ వదిన మరదళ్ల డివికి డివికి డిక్కుమ్..సాంగ్ వినేయండి..
